హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠాలు మళ్లీ రెచ్చిపోతున్నాయి. ఈ డ్రగ్స్ స్మగ్లర్లకు ఏకంగా అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలు ఉంటున్నాయి. హైదరాబాద్ లో ఈ సారి  పట్టుబడుతున్న అంతర్జాతీయ డ్రగ్ ముఠాలు  పట్టుబడుతున్నాయి. తాజాగా కొకైన్, మెటాంఫెటమైన్ సరఫరా చేస్తున్న ముఠాలను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ కేంద్రంగా ఈ ముఠాలు దందా సాగిస్తున్నాయి. ఈ ముూఠాలు కోడ్ భాషలో వినియోగదారులకు డ్రగ్స్ వివరాలు అందిస్తున్నాయి.


కోడ్‌ల ఆధారంగా వివరాలు తెలుసుకుంటున్న వినియోగదారులు.. తమ ఆర్డర్లు ఇస్తున్నారు. తాజాగా పట్టుబడిన సరఫరా దారుల వద్ద హైదరాబాద్ లోని పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది.  ఈ రెండు కేసుల్లో తెలంగాణాకు చెందిన 20 మందిని నార్కొటిక్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్ పోలీసులు గుర్తించారు. తాజాగా అరెస్ట్ అయిన వారిలో గతంలో పంజాగుట్టలో అరెస్ట్ అయిన అంతర్జాతీయ నేరస్థుడు టోనికి కొకైన్ సరఫరా చేసిన నిందితుడు కూడా ఉన్నాడు. కొకైన్ సరఫరా చేస్తూ అరెస్ట్ అయిన వారిలో యాంబోయ్ చువుడికి టోనితో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది.


యాంబోయ్ చువుడి అనేవాడు టోనికి కొకైన్ సరఫరా చేసినట్టు పోలీసులు గుర్తించారు. మెటాంఫెటమైన్ డ్రగ్స్ సరాఫరా చేస్తున్న ఇద్దరు  నిందితులను అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. -అహ్మద్ కమల్, మ్యాథిస్ ఎ షావాలు డ్రగ్ సరఫరా చేస్తుండగా రాజేంద్ర నగర్ సన్ సిటి కాలనీలో అరెస్ట్ చేశామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. వీరి నుంచి 11లక్షలు విలువ చేసే 110 గ్రాములు మెటాంఫెటమైన్ డ్రగ్, మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నామన్నారు.


స్నాప్ చాట్ యాప్ ద్వారా కస్టమర్లతో మాట్లాడుతున్నారని.. వీరి వద్ద 6గురు వినియోగదారులు వివరాలు సేకరించామని సీపీ సీవీ ఆనంద్  తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇమాన్యూల్ పరారీలో ఉన్నాడన్న సీపీ సీవీ ఆనంద్ .. అంతర్జాతీయ డ్రగ్ సరఫరా దారులతో వీరికి సంబంధాలు ఉన్నాయని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: