మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డికి.. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్‌ లీగల్‌ నోటీసులు ఇచ్చారు. మాజీ సీఎం మర్ని చెన్నారెడ్డి కుమారుడైన మర్రి శశిధర్ రెడ్డి.. ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన ఆ సమయంలో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వంపై అనేక విమర్శలు చేశారు. కాంగ్రెస్‌లో డబ్బుతోనే పదవులు వస్తాయన్నారు. ఇంకా అనేక ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు.


భారతీయ జనతా పార్టీలో చేరబోతూ  సోనియాగాంధీకి లేఖ ద్వారా తెలియచేసిన అంశాలు పూర్తిగా అభ్యంతరకరమైనవిగా ఉన్నాయంటున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్‌.  రేవంత్‌ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు తాను, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌.. ఇద్దరు లబ్ది పొందినట్లు మర్రి శశిధర్ రెడ్డి  పేర్కొన్నారని... అదేవిధంగా ఎలాంటి ఆధారాలు లేకుండా పార్టీపైన నిరాధారమైన ఆరోపణలు చేశారని మానిక్కం ఠాగూర్‌ ఆరోపించారు.


అదే ఏధంగా అదే లేఖను మీడియాకు పంపిణీ చేసిన విషయాన్ని కూడా మానిక్కం ఠాగూర్‌ లేఖలో ప్రస్తావించారు. అదే విషయాలను కూడా అటు తెలుగు, ఆంగ్ల పత్రికలల్లో, ఎలక్ట్రానిక్‌ మీడియాలో కూడ ప్రచురితమైనట్లు మానిక్కం ఠాగూర్‌ వివరించారు. అవన్నీ తమ పరువుకు భంగం కలిగించేట్లు ఉన్నాయని మానిక్కం ఠాగూర్‌ పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేసిన మర్రి శశిధర్‌ రెడ్డి వారం లోపల ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని భేషరతుగా క్షమాపణలు చెప్పాలని మానిక్కం ఠాగూర్‌ డిమాండ్‌ చేశారు.


అలా చేయకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని మానిక్కం ఠాగూర్‌ స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కుమారుడిగా గుర్తింపు పొందిన మర్రి శశిధర్‌ రెడ్డికి పార్టీ ఎన్నో పదవులు కట్టబెట్టిందని మానిక్కం ఠాగూర్‌ అన్నారు. ఆలాంటిది మర్రి శశిధర్‌ రెడ్డి పార్టీ నియమనిబంధనలు ఉల్లంఘించి ప్రవర్తించారని మానిక్కం ఠాగూర్‌ అన్నారు. అందువల్లనే ఆయనను క్రమశిక్షణ కమిటీ పార్టీ నుంచి ఆరేళ్లుపాటు బహిష్కరించినట్లు మానిక్కం ఠాగూర్‌ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: