
ఈ సినిమా రికార్డ్ పరంగా కూడా జెట్ స్పీడ్ లో ముందుకు దూసుకెళ్తుంది. నైజం లో ఇప్పటికే సెన్సేషనల్ రికార్డ్స్ అందుకున్న ఈ సినిమా..ఇంకా తన సత్తాని చాటుతుంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ సుజిత్ ఫ్యాన్స్ కోసం ఒక స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. ఓజి సినిమా పార్ట్ 2 ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓజి సినిమాతో పాటు, ఇప్పటివరకు ఆ యూనివర్స్ లో సినిమాలన్నీ కలిపి మొత్తం మూడు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఫుజులు ఎగిరిపోయాయి. అంటే, ఓజి మూవీకి ప్రీక్వెల్ మరియు సీక్వెల్ రెండు కూడా ఉంటాయి అని అర్ధం. ఈ ఒక్క అప్డేట్ తో మళ్లీ ఓజీ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ లోకి వచ్చాయి. సుజిత్ మరియు వారి టీమ్ మొత్తం ‘ఓజి యూనివర్స్’ పై ఒక గ్రూప్‌గా పని చేస్తున్నారు అని తెలిపారు. ఆ గ్రూప్ లో ఎప్పుడు దీనికి గురించే మాట్లాడుకుంటామని కూడా తెలిపారు.
అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ రెండు సినిమాలను ఒకేసారి షూట్ చేసి, ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులను ఎంతగానో ఎక్సైట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్‌ని ఇప్పటివరకు చూడనంత రేంజ్‌లో ఓజి సినిమాలు చూపించాడు. అభిమానులు ఈ ఫీలింగ్‌ను మర్చిపోలేరు. కానీ, ఓజీ కీ సీక్వెల్-ప్రీక్వెల్ లో పవన్ కళ్యాణ్ ఉంటాడా? లేదా..? అన్నది బిగ్ క్వశచన్ మార్క్. డైరెక్టర్ సుజిత్ తీసుకునే నిర్ణయాలు ఎంతవరకు ఆయనకు అనుకూలంగా ఉంటాయో..? పవన్ ఫ్యాన్స్ ఎంతవరకు మెప్పిస్తాయో..? చూడాలి..!!