ఎయిర్ డిఫెన్స్ సిస్టం అనేది ప్రతి దేశానికి అత్యంత కీలకమైనది. విదేశాల నుంచి వచ్చే యుద్ధ విమానాలను, యుద్ధ మిస్సైల్స్ ను, ముందుగానే గుర్తించి దాడి చేసేటువంటిదైన  రష్యా నుంచి కొంటున్న ఎస్ 400, అమెరికా నుంచి కొత్తగా కొంటున్నది, మనం సొంతంగా తయారు చేసుకుంటున్నది  రాడార్.  మొన్న పాకిస్తాన్ బాలాకోట్ కు వెళ్ళినప్పుడు అక్కడ దాన్ని వాళ్ళు గుర్తించి వెంటపడడం జరిగింది. వాళ్లను ఏదో విధంగా డైవర్ట్ చేసి ఎయిర్ డిఫెన్స్ సిస్టం ద్వారా బాలా కోట్ పై ఎటాక్ చేసింది భారత్.


గతంలో పంజాబ్ లోని పటాన్ కోట్ పైకి దాడి చేయడానికి వచ్చిన ఎఫ్16 విమానాల పైకి మిగ్గులతో దాడి చేసి తరిమికొట్టింది భారత్. మన దేశ డిఫెన్స్ సిస్టం, ఇంకా పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టం రెండూ కూడా బాగానే ఉంటాయి. వీటి వరకు బాగానే ఉన్నా, 27 దేశాల నుండి వచ్చే ఆయుధాలతో ఉన్న ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం మాత్రం ఎందుకు బాగుండడం లేదో తెలియడం లేదు. రష్యాకు సంబంధించిన సుకోయి యుద్ధ విమానాలు ఇప్పుడు వరుస పెట్టి ఉక్రెయిన్ పై దాడి చేస్తున్నాయి, వారి ఆకాశతలంలో ఎగురుతూ బాంబుల మోత మోగిస్తున్నాయి. మిస్సైల్స్ తో దాడి చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కూడా ఉక్రెయిన్ మాత్రం వాటిని ఏమీ చేయలేక పోతుంది.


దానిలో లోపం  సామర్థ్యం లేకపోవడం అయినా కావచ్చు, లేదా సదుపాయం లేకపోవడం అయినా కావచ్చు. ఉక్రెయిన్ మాత్రం రష్యాపై తన టెక్నాలజీని ఉపయోగించుకుని, ప్రత్యర్థి దేశమైన రష్యాపై సరి సమానంగా దాడి చేయలేక పోతుంది. రష్యన్ వార్ హార్స్ సుకో 25 ఫైటర్ జెట్ విమానాలు  డాన్ బాస్కో వద్ద ఉక్రెయిన్ సైనిక స్థావరాలపై దాడి చేసాయి.  రష్యన్ మిలిటరీ డిఫెన్స్ ప్రకారం, ఉక్రెయిన్ దళాల కాక్‌ఫిల్డ్ యూనిట్లు ధ్వంసమయ్యాయి. రష్యా తన సామర్థ్యంతో ఉక్రెయిన్  ముందస్తు బలగాలన్నిటిని తుడిచి పెట్టేయడం అయితే చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: