
స్టాక్ మార్కెట్ల ఊగిసలాటపై ఏ మాత్రం ఆందోళన అవసరం లేదన్నారు. అదానీ గ్రూపులు, బ్యాంకులు, షేర్ లో పెట్టుబడులు పెట్టారని ఆయన సంస్థల్లో పెట్టుబడి పెట్టిన వారు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. రూ. 5 కోట్లు అంతకంటే ఎక్కువ రుణాలిస్తే వాటికి సంబంధించి వాటిపై పరిశీలన కొనసాగిస్తున్నాం. అధిక మొత్తం రుణాల విషయంలో కేంద్ర మార్గదర్శకాలను బ్యాంకులు పాటిస్తూ ఉంటాయని చెప్పారు.
అదానీ నిధులు సామాజీకరణ సామర్థ్యం ప్రస్తుతం తరుణంలో దెబ్బతినే అవకాశం ఉంటుందని మూడీస్ సర్వే అంచనా వేసింది. అదానీ కంపెనీల ఆర్థిక స్థిరత్వం మదింపు చేస్తున్నామన్నారు. అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్ మిషన్లకు మేమిచ్చే రేటింగ్ లు ఆయా కంపెనీల పరిస్థితులను బట్టి ఉంటాయి. ఒకటి, రెండు సంవత్సరాల్లో మూలధన వ్యయానికి సంబంధించి ఆ గ్రూపు సామర్థ్యాన్ని దెబ్బ తీయొచ్చని తాజా పరిణామాలు తెలుపుతున్నాయి.
అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ల బాండ్ ల గడువు 2024 లో తేలనుంది. మిగతా కంపెనీలకు 2026 వరకు గడువు ఉండటం ఆయనకు ఊరటనిచ్చే అంశం. తక్షణ రేటింగ్ ప్రభావం ఉండదని పిచ్ పేర్కొంది. అదానీ ఎంటర్ ప్రైజేస్ లో ఫిబ్రవరి 7 నుంచి తమ సస్టయినబుల్ నుంచి తొలగిస్తున్నట్లు ఎస్ఎన్ పీ డోజోన్స్ తెలిపింది.