పెట్రోల్, డిజీల్ వాడకాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ. బస్సులు, లారీలు, హెవీ వెహికిల్స్ నడవడానికి భారత్ లో 70 శాతం డీజిల్ నే వాడుతున్నారు. ఈ సమయంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ హైడ్రోజన్ తో నడిచే ట్రక్ ను తయారు చేస్తున్నారు.


దీని వల్ల పొల్యూషన్ ఉండదు. తక్కువ ధరల్లో వస్తుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా విప్లవాత్మకంగా మార్పులు జరుగుతాయన్నది వాస్తవం. 1000 రూపాయాలకు వస్తువు తయారైతే దాన్ని ట్రాన్స్ పోర్టు చేయడానికి అయ్యే డీజిల్ ఖర్చు ఎక్కువ. తర్వాత హోల్ సెల్, వ్యాపారం, రిటైల్ వద్దకు చేరే సరికి 5 రేట్లు పెరుగుతుంది. ఇలా పెరగడం వల్ల ఉదాహరణకు 1500 రూపాయాలకు వచ్చే వస్తువు, 5000 రూపాయాల వరకు ధర పలుకుతుంది.


కానీ హైడ్రోజన్ వెహికల్ వల్ల రవాణా ఛార్జీలు మొత్తం తగ్గుతాయి. దీని వల్ల వస్తువుల ధరలు తగ్గుతాయి. సామాన్యుడికి చాలా వరకు లాభం చేకూరుతుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా విప్లవాత్మకమవుతుంది. హైడ్రోజన్ ట్రక్కుతో పొల్యూషన్ అనేది లేకపోవడం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది.


పెట్రోల్, డీజిల్ ల వాడకం కూడా తగ్గుతుంది. ఇలాంటి ప్రయోగాలు భారత్ తయారు చేయడం గర్వకారణం. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గి పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదు. స్వచ్ఛమైన గాలి అందుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలతో మాత్రం ఒక చిక్కు వచ్చింది. ఇందులో ఉన్న బ్యాటరీలు పేలిపోవడం తో చాలామంది ఆందోళనకు గురవుతున్నారు. కొంతమంది బ్యాటరీలు పేలి చనిపోయారు. ఇది కాస్త ఇబ్బంది కలిగించే విషయం. హైడ్రోజన్ తో నడిచే వాహనాలు రక్షణలో మెరుగ్గా ఉండేలా చూస్తే చాలు.. ఇక ప్రజలు దాని వెంట పడతారు. ప్రపంచంలోనే హైడ్రోజన్ వాహనాలు విప్లవాత్మకంగా నిలిచిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: