తిండి లేనప్పుడు ఆవేశం వస్తుంది.. ఆవేశం వస్తే ఆలోచనలు మందగిస్తాయి.. ఇలాంటి సందర్భంలో భావోద్వేగం ఎలా నడిపిస్తే అలా మన పనులు కూడా తిరుగుతాయి. దాని ఫలితం కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్లో అదే జరుగుతుంది. ఆకలితో అలమటిస్తున్న పాకిస్తాన్ ప్రజలను తిండిపెట్టి ఆదుకోవాల్సిన ప్రభుత్వం, అది మానేసి వారికి భారతదేశం మీద కక్షను నూరిపోస్తుంది. భారతదేశంలోని హిందువులని శత్రువులుగా చూపిస్తుంది. లేదంటే వాళ్ళ దేశంలోనే ఉన్న మైనారిటీ వర్గ ప్రజలైన ముస్లింలను విలన్లుగా చూపిస్తుంది. దీంతో లిన్ చిన్ దాడులు కంటిన్యూగా జరుగుతున్నాయి.


అక్కడ షియా-సుమీల మధ్య దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. షియాలు ఎక్కువ ఉన్న చోట సుమీలు దాడి చేస్తున్నారు. ఒకవైపు ఇమ్రాన్ ఖాన్ మరొక వైపు షబా షరీఫ్ ఇద్దరూ ఇళ్లలోనే కూర్చుని ఉన్నారు. ఈ పరిస్థితి ఇప్పుడే పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదు. పాకిస్తాన్లో వస్తున్న ఈ మార్పులు యుద్ధ వాతావరణాన్ని సూచిస్తున్నాయి. చివరికి ఐఎంఎఫ్ కూడా డబ్బులు ఇవ్వడానికి వెనకాడుతున్న పరిస్థితి అక్కడ నెలకొంది.


పిచ్ అనే గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ పాకిస్థాన్‌లో డిఫాల్ట్ నెలకొనే అవకాశం వాస్తవమేనని హెచ్చరించింది.  ద్రవ్యోల్బణం 48 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పుడు మరియు అంతర్జాతీయ ద్రవ్య నిధి బెయిల్ అవుట్ దుర్వినియోగంగా ఉన్న సమయంలో ఇది వస్తుంది. శ్రీలంకలో లాగా ఇప్పుడు పాకిస్తాన్లో కూడా డిఫాల్ట్ ని ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఐ.ఎమ్.ఎఫ్ నిబంధనలకు అనుగుణంగా సహజ వాయువుల ధరలను పాకిస్థాన్ కూడా దాదాపు ఇప్పుడు రెట్టింపు చేసింది.


ఒక పక్క జనాలు ఇప్పటికే ఉపాధి అవకాశాలు లేక, తిండి లేక గొడవలు చేస్తుంటే ఐ.ఎం.ఎఫ్ ఒక పక్కన నువ్వు ఎలా డబ్బులు పట్టుకొస్తావో చెప్పు అంటూ సబ్సిడీ ఎత్తేస్తుంటే అక్కడ ఇప్పుడు డొమెస్టిక్ గ్యాస్ ధర 2,950 రూపాయల వరకు చేరింది. అక్కడ ప్రజలు అంత పెట్టి గ్యాస్ కొనలేక పాకిస్తాన్ ప్రజల్లో తిరుగుబాటు పెరిగే పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: