ఇరాన్ మీద ఆంక్షలు అమెరికా ఆంక్షలు పెట్టింది. అదే ఇరాన్ నుంచి స్మగ్లర్లు ఆయిల్ కొంటారు. దాన్ని అమెరికా కొనుక్కొని శుద్ది చేసి యూరప్ దేశాలకు ఆయిల్ అమ్ముకుంటుంది. ఆయుధాల వ్యవహారంలో అమెరికా దొంగ దారిని ప్రోత్సహిస్తుంది. పాకిస్థాన్ కూడా ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేస్తోంది. నాటో దేశాల్లో ని బల్గేరియా కూడా ఉక్రెయిన్ కు కొన్ని కోట్ల విలువైన ఆయుధాలను అందజేస్తుంది.


బల్గేరియా ప్రభుత్వం అధికారికంగా చెప్పిన విషయం ఏమిటంటే మేం ఆయుధాలను ఉక్రెయిన్ కు అమ్మడం లేదు. ఇవ్వడం లేదని చెబుతోంది. అయితే ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన ఓ మీడియా సంస్థ ఇన్విస్టేషన్ లో తేలింది ఏమిటంటే బల్గేరియాలోని ఆయుధ కర్మాగారాలను కంపెనీలకు అమెరికా డబ్బులు చెల్లిస్తోంది.


దీంతో బల్గేరియా ప్రభుత్వానికి తెలియకుండా  ఆయుధాలను ఉక్రెయిన్ కు సరఫరా చేస్తోంది. వాస్తవంగా బల్గేరియా నుంచి ఎలాంటి ఒప్పందం లేకుండా ఉక్రెయిన్ కు ఇవ్వడం అనేది దొంగచాటుగా కొన్నట్లే. ఒక దేశంలో అధికార ప్రభుత్వానికి తెలియకుండా అమెరికా డైరెక్టుగా ఆయుధ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని ఆయుధాలను పంపండం అంటే అంత తేలికైన విషయం కాదు. అమెరికా నిషేధం విధించిన ఇరాన్ నుంచి కూడా ఏ దేశం ఆయిల్ కొనవద్దని ఆంక్షలు పెడుతూ .. అక్కడి నుంచి దొంగ చాటుగా ఆయిల్ ను కొనుక్కుంటూ దాన్ని శుద్ధి చేసుకుని యూరప్ దేశాలకు, మిగతా చిన్న దేశాలకు అమ్ముకుని ఆర్థికంగా బలంగా తయారవుతుంది.


కానీ ఇరాన్ నుంచి అధికారికంగా మేం కొనడం లేదు. ఎవరూ కొనవద్దని చెబుతోంది. చెప్పేవి నీతి సూత్రాలు కానీ వేటినీ అమెరికా పాటించదు. ఇదే విధంగా ప్రస్తుతం అమెరికా ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేస్తున్నాం అని చెబుతున్నా.. దాన్ని బల్గేరియా నుంచే ఇస్తున్నట్లు మీడియా ఇన్విస్టిగేషన్ లో తేలింది. అంటే వేరే దేశాల్లో కూడా ఆ దేశ ప్రభుత్వానికి తెలియకుండా ఆయుధాలను సరఫరా చేస్తుందంటే అమెరికా ఎంతకు తెగించిందో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: