ఈడి విచారణను ఎదుర్కోవడానికి కవిత ఎందుకు భయపడుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆవిడకి ఏదో అన్యాయం జరిగిపోతుందని అయితే ప్రజలు మాత్రమే కాదు, వాళ్ళ పార్టీలోని సభ్యులు కూడా అనుకోవడం లేదని తెలుస్తుంది. తప్పు ఎవరు చేయరు అన్న ధోరణిలోనే, కవిత కూడా తప్పు చేసింది అన్నట్లుగా వాళ్లు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఆమె ఏ తప్పూ చేయనప్పుడు ఈ.డి విచారణను ఎదురుకోవడానికి, విచారణ ఆరింటిలోగానే జరగాలి, అర గంటే జరగాలి. బోర్నవిటా ఇచ్చి జరపాలి, కాపీ ఇచ్చి జరపాలని సిల్లీ థింగ్స్ తో ఆపాల్సిన పని ఏంటి. అసలు ఈడీ ఏం అడుగుతున్నారు ఫోన్లు ఎందుకు బ్రేక్ చేసావ్, ఎందుకు ఫర్నేసులో వేసి తగలబెట్టావ్ అనేది మొదటి పాయింట్.


రెండో పాయింట్ ఏంటంటే నువ్వు హోటల్ కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూర్చున్నప్పుడు నువ్వు అక్కడ ఉన్నావా లేదా?  ఈ సౌత్ అనే సంస్థలో నీ పెట్టుబడి ఉందా లేదా, లేదంటే లేదని చెప్పు, ఒకవేళ ఉందని వాళ్ళు ఏదైనా ఆధారం చూపిస్తే ఆ ఆధారం నీది కాదని చెప్పు. వీటన్నిటి పైన ఏదైనా నివేదిక ఇస్తే అది నీకు సంబంధం లేకపోతే, సంబంధం లేదని చెప్పు. అంతేగాని నేను ఈడికి రాను, మీరే మా ఇంటికి రండి అంటే తెలంగాణలో పోలీసులు ఎంక్వయిరీకి మహిళల్ని పోలీస్ స్టేషన్ పిలవట్లేదా?  షర్మిలను కూడా అరెస్టు చేసి తీసుకువెళ్లారు కదా.


కానీ ఇక్కడ ఈడి అలా కాదు కదా. మీరంతటా మీరే రండి. వచ్చి విచారణలో పాల్గొనండి అంటుంది. గతంలో విచారణకు అటెండ్ అయిన ఆమె ఇప్పుడు ఎందుకు భయపడుతుంది. పైకి గుంభనంగా ఉన్నట్లు కనపడుతున్నా భయపడిపోతుంది . తప్పు చేయనప్పుడు ఉండే ధైర్యం లా లేదు అది, తప్పు చేసి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నంలా ఉంది. కానీ పొలిటికల్ యాస్పెక్ట్ లో చూసినప్పుడు చూస్తున్న జనాల్లోకి ఒక నెగటివ్ సంకేతం పోతుందనేది గ్రహించుకుంటే బెటర్, అది కూడా ఎలక్షన్స్ ముందు.

మరింత సమాచారం తెలుసుకోండి: