పరిణామాలు ఏ విధంగా ఎలా మార్చేస్తారు అనడానికి సజీవ సాక్ష్యం తాజాగా కనపడుతున్నటువంటి విషయం. అమెరికాకు సంబంధించిన పరిణామాలు, రష్యా కి సంబంధించిన పరిణామాలు ఒక ఎత్తైతే, చైనాకి సంబంధించిన పరిణామాలు మరో ఎత్తు. చైనాలో తాజాగా జరుగుతున్న పరిణామం ఏంటయ్యా అంటే, ఒకవైపు మళ్ళీ అక్కడ లాక్ డౌన్ మొదలవ్వబోతుందట. ఎందుకయ్యా అంటే ఇన్ఫ్లుయాంజా వల్ల వచ్చే  జ్వరం, దగ్గు, జలుబు ఇవి సీజన్ మారిన ప్రతీసారి వస్తూంటాయి. ఒక టాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది.


చైనాలో కూడా  అలానే చేశారు. కానీ కరోనా ఎఫెక్ట్ కారణంగా మందుల ప్రొడక్షన్ పడిపోయింది. ఇదివరకు వాళ్ళ రా మెటీరియల్ ఇక్కడకు వస్తే భారత్ కి పంపిస్తే, భారత్ మందులు తయారుచేసి పంపించేది. ప్రస్తుతం వాళ్లు రా మెటీరియల్ భారతదేశానికి పంపకపోవడం వల్ల, మనం మందులు పంపడం మానేశాం. దానితో అక్కడ పరిస్థితులు మారిపోయాయి. దాని పర్యవసానమే ఈ పరిస్థితి.


దీనితో ఇప్పుడు చైనా ఏం చేస్తుంది? మందులు ఇవ్వడం చేతకాక, మందులు దొరకనటువంటి పరిస్థితుల్లో కొత్త ఎత్తుగడ వేస్తుంది. అదే లాక్ డౌన్. కరోనా టైంలో లాక్ డౌన్ వల్ల తీవ్ర సంక్షోభంలో పడ్డ చైనా, మరో లాక్ డౌన్ కి సిద్ధపడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ లాక్ డౌన్ అనేది పతాక స్థాయికి వెళ్తే గనుక చైనాలో ప్రజా తిరుగు పాటు చేసే అవకాశం మెండుగా ఉంది.


మొన్నటి సారి తిరుగుబాటును అణిచివేసి జింపింగ్ మళ్లీ అధ్యక్షుడు అయ్యాడు. కాబట్టి ఇక ప్రజల కోరిక, అవసరాలు ఆయనకి పట్టనట్టుగా, అన్నీ పక్కనపెట్టి వ్యవహరించడానికి సిద్ధపడుతున్నట్టు ఉన్నాడు చైనా అధ్యక్షుడు జింపింగ్. తాను ల్యాబ్ లో తయారుచేసి ప్రపంచం మీద వదిలిన కరోనా అనే భూతం, దాని వల్ల వచ్చిన దుష్పరిణామాలు ఇప్పటికీ చైనా ను వదలడం లేదు. అందుకే పెద్దవాళ్ళు అంటారు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ‌ అని.

మరింత సమాచారం తెలుసుకోండి: