
అటువంటి చైనా ప్రస్తుతం మళ్ళీ శాంతి చర్చలు మాట లేవనెత్తు తోంది. ఒకపక్క దౌత్య పరమైనటువంటి చర్చలు జరుగు తూనే ఉండగా గాల్వాన్ లోయలో భారత సైనికులపై దుశ్చర్యకు ఒడిగట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా జరిగిన దాడిలో 20 మంది సైనికులు అమరులయ్యారు. అప్పటివరకు పాకిస్తాన్ తోనే భారత్ కు తల నొప్పుందని అందరూ అనుకునే వారు.
అసలైన సమస్య డ్రాగన్ కంట్రీతో నే అని ఆ క్షణం వరకు ఎవరికీ తెలియదు. గాల్వాన్ లోయలో జరిగినటువంటి ఘర్షణలు, సైనికులు చనిపోవడం ఎంతో విషాదకరమని జైశంకర్ అన్నారు ఒక పక్క సైనికులను మట్టు పెడుతూ మరోపక్క శాంతి చర్చలు అని చైనా మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరమైన విషయం.
చైనా ఇలాంటి చేష్టల వల్ల ప్రపంచ దేశాల ముందు అభాసు పాలవుతుందన్నారు. చైనా కు సంబంధించినటువంటి మీడియా ఆ అధికార పార్టీకి సంబంధించిన జిన్ పింగ్ నాయకత్వా న్ని గతంలో పొగడ్తలతో ముంచెత్తింది. మొత్తం మీద చైనా, భారత్ మధ్య శాంతి నెలకొనడానికి చేస్తున్నా చర్చలు ఒక పక్క జరుగుతుండగానే చైనా తీసుకున్న నిర్ణయం వల్ల భారత్ తన సైనికులను పోగొట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం చర్చలు అని చైనా సందేశం పంపడంతో జైశంకర్ చైనా ను ఏకీ పడేశారు. మా సైనికుల ప్రాణాలు తీసినపుడు మీకు శాంతి చర్చలు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు.