భారతదేశంలో ఒక రేప్ కేసులో నిందితుడైన నిత్యానంద ఇప్పుడు మేధావులను కూడా ఫూల్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన అనుయాయులు అది ఆయన మాయగా, శక్తిగా, దైవత్వంగా చూపిస్తున్నారు. ఏదైతే ఐక్యరాజ్యసమితిలో కైలాస దేశం తరఫున మాట్లాడుతున్నాను అనడం, అమెరికాలోని వివిధ రాష్ట్రాలతో ఒప్పందం చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వం విచిత్రం ఏంటంటే అది కేవలం ఇంటర్నెట్లో మాత్రమే ఉందట, అక్కడ జనాలు లేరట.


వెబ్సైట్లో ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అమెరికాలోని ద్వీపం అని చెప్పిన చోట కూడా ఆయన లేడట. కానీ ఆయన పేరుతో ఈ వెబ్సైట్లో ఇంటర్నెట్లో కథ అయితే నడుస్తుంది. కానీ ఆయన ఎక్కడున్నాడో ఎవరికి తెలియడం లేదు. తాను ఎక్కడున్నాడో చెప్పకుండా అక్కడే ఉంటున్నట్టుగా భ్రమ కల్పిస్తూ ప్రత్యేకమైన కరెన్సీ, ప్రత్యేకమైన రిజర్వ్ బ్యాంక్ ని చూపిస్తూ ప్రపంచవ్యాప్తంగా వివిధ కూటముల్లో ఈయన తరఫున ప్రతినిధులు పార్టిసిపేట్ చేస్తున్నారనే విషయం తాజాగా బయటపడింది. అలా ఆయన ఐక్యరాజ్యసమితిని, అమెరికాను కూడా మోసం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.


వాస్తవంగా ఈ నిత్యానంద అనే వ్యక్తి 1978లో తమిళనాడులో పుట్టాడు. ఈయన అసలు పేరు రాజశేఖరన్. 2018లో  రేప్ కేస్ కారణంగా ఈక్విడార్ లోని ద్వీపంలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. కాలిఫోర్నియాలో ఉన్నట్లుగా చూపించుకువచ్చాడు. అయితే అక్కడ కూడా ఆయన ఉన్నాడన్న గ్యారెంటీ లేదు. అయితే అక్కడ ఒక బ్యాంకుని, ఒక అంబాసిడర్ ని, వివిధ దేశాలకు ఈయన ప్రత్యేకమైన అంబాసిడర్ లను కూడా పెట్టేసాడట.


ఆ రాయబారులు ఇప్పుడు వ్యవహారం నడుపుతున్నారట. దుబాయ్ లో కూడా ఈ మధ్యన రాయబారిని పంపించాడట. దుబాయ్ ప్రభుత్వంతో కూడా, దుబాయ్ లోని ఒక నగరంతో కూడా ఇట్లాంటి ఒప్పందాన్నే పెట్టుకున్నాడట. ఆ ఒప్పందం కుదుర్చుకున్నటువంటి నగరం వాళ్ళు ఆ ద్వీపం దగ్గరికి వెళ్లి చూస్తే ఆయన, ఆయన చెప్పిన నగరం రెండూ కనిపించ లేదట. దాంతో ఈ మాయా నగరపు సృష్టికర్త గురించి మరోసారి చర్చ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: