
రష్యా రక్షణ శాఖ మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఉక్రెయిన్ కు సంబంధించిన 580 ట్రూప్లను ధ్వంసం చేసినట్లు ప్రకటించారు. అందులో దాదాపు 197 మంది ఉక్రెెయిన్ సైనికులు చనిపోయినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎక్కడ ఎలాంటి దాడులను చేసిందో రష్యా వీడియోలో రికార్డు చేస్తుంది. చేసిన దాడులను నమ్మే విధంగా బయటకు ఆ వీడియోను రిలీజ్ చేస్తుంది. అమెరికా డ్రోన్ ను కూడా కూల్చేసినట్లు ప్రకటించారు. డ్రోన్ ద్వారా ఉక్రెయిన్ సైన్యాన్ని ముందుగా గుర్తించి వారిపై ఎటాక్ చేసింది రష్యా. వారు ప్రాణాలు కోల్పోతున్న వీడియోను రికార్డు కూడా చేసింది.
కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. రష్యా చెబుతున్నా అంశాలు అన్ని అబద్దమేనని అలాంటి దాడి ఏం జరగలేదని చెప్పారు. కానీ అమెరికా ఇస్తానన్న ఆయుధాలు, మిస్సైల్స్ ఇవ్వకుండా తాత్సరం చేస్తుంది. దీనికి తోడు రష్యా భీకర దాడులు ఇక్కడ బీభత్సం గొలుపుతున్నాయి. ఉక్రెయిన్ పై రోజు రోజుకు దాడుల్ని పెంచేస్తుంది. ఉక్రెయిన్ సైనికులు ఎక్కువ సంఖ్యలో మరణిస్తున్నారు. యుద్ధంలో సాయం అందిస్తామని చెప్పినా యూరప్ దేశాలు సరైన సమయానికి ఆయుధాలను పంపించడం లేదు.
అదే స్థాయిలో రష్యా వద్దకు ఎక్కువగా ఆయుధాలు చేరుతున్నాయి. ఇరాన్, చైనా రహస్యంగా ఆయుధాలు ఇస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇంకా రెండు సంవత్సరాల వరకు రష్యాకు యుద్ధం చేసేంత సామర్థ్యం ఉందని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా రెండు సంవత్సరాలు యుద్ధం చేయాలంటే ఉక్రెయిన్ కు కావాల్సిన ఆయుధ సామగ్రిని ఎవరు ఇవ్వాలి. అప్పటి వరకు పోరాడాలంటే సైన్యం అలసిపోకుండా ఉండాల్సిందే.