
రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉండగానే, కేంద్రంలో బిజెపి ఉండగానే సిబిఐ ఎంక్వయిరీ పతాక స్థాయికి చేరింది. అలాంటప్పుడు మోడీ ఫోన్ చేసి సిబిఐ ని ముందుకు సాగద్దని చెప్పాడు అనుకోవడం వెర్రితనం తప్ప మరొకటి ఉండదు. కానీ దేని గురించి అడిగి ఉండవచ్చు. ఒకటి ముందస్తు ఎన్నికల గురించి అనుకుంటే, రెండు చంద్రబాబు మీద ఉన్న కేసు గురించి అనే అనుమానం వ్యక్తం అవుతుంది.
ఈడి ఎంక్వయిరీ కూడా ఓ పక్కన జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ వ్యవహారంలో చంద్రబాబు సంతకాలు పెట్టిన లెక్కలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. యాక్చువల్‌గా ఈడి అయితే చంద్రబాబుకి నోటీసులు ఇవ్వాలి. ఎవరైతే మొన్న తెలుగుదేశం నుండి బిజెపిలోకి వెళ్లిన చంద్రబాబు సన్నిహితులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని ఈడీని డౌన్ ప్లే చేయడానికి, అంటే కింద ఎవరైతే దొరికారో వాళ్ళతో క్లోజ్ చేయడానికి చూస్తున్నారనే దాన్ని మోడీ, ఇంకా అమిత్ షా దృష్టిలోకి తీసుకెళ్లడానికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది.
ఇది ఉత్తుత్తి ఎలిగేషన్ కాదు. ప్రత్యక్షంగా బాబు పాత్ర సెక్రెటరీ రాసిన నోట్ లోనూ, డబ్బు రిలీజ్ చేసేటప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ రాసిన నోట్ లోనూ చాలా క్లియర్ గా ఉండడం, ఈడి విచారణ పైన జరిగేది ఆపడానికి ఈడీలో ఉండే సెకండ్ గ్రేడ్ అధికారుల ద్వారా చంద్రబాబు తన ఇన్ఫ్లూయన్స్ తో చేస్తున్నారు అనే నేపథ్యంలోనే మోడీ దృష్టికి తీసుకెళ్లడానికి జరిగిన ప్రయత్నమని కూడా వినిపిస్తుంది.