
కేవలం పార్టీలనో లేదా నేతలనో ఒకే తాటిపైకి తీసుకురావడం వల్ల విపక్షాల ఐక్యత సాధ్యం కాదని స్పష్టం చేశారు ఆయన. ఆ రకంగా అయితే వాళ్ల ప్రయత్నం నెరవేరే ప్రసక్తే లేదని ఆయన చెప్తున్నారు. హిందుత్వం, జాతీయ వాదం, సంక్షేమం ఈ మూడు బిజెపి యొక్క మూల స్తంభాలు. ఈ మూడింటిలో రెండిటినైనా ఎదురుకోకపోతే భారత్ లో బలంగా పెనవేసుకుపోయిన భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి సరిపోరు అని ఒక జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు.
బిజెపి హిందుత్వ భావజాలంపై ఎవరైనా పై చేయి సాధించాలంటే గాంధేయవాదులు, సోషలిస్టులు, కమ్యూనిస్టులు, అంబేద్కర్ వాదులు ఇలా అన్ని భావజాలాల నేతల వాళ్ళూ కలిసి ముందుకు రావాలని ఆయన స్పష్టంగా తెలిపారు. అంతవరకు, అలా జరగనంత వరకు ఎవరూ బిజెపిని ఓడించగలిగే ప్రసక్తే లేదు. అలాగని భావజాలన్ని మాత్రమే గుడ్డిగా నమ్ముకోకూడదు అని ఆయన చెప్తున్నారు. నా లక్ష్యం కాంగ్రెస్ పునరుజ్జీవనం, వారికైతే ఎన్నికల్లో గెలవడమే, వాళ్ల కోరుకున్న మార్గంలో నా ఆలోచనలు అమలు చేయడానికి వాళ్ళు అంగీకరించలేదు కాబట్టి నేను ఆగాను.
ఆరు నెలల్లో భారత్ జోడో యాత్రలో ప్రశంసలు, విమర్శలు వచ్చాయి. కానీ ఇంతవరకు క్లారిటీ రాలేదని రాహుల్ యాత్ర గురించి కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతానికి బిజెపిని ఎదుర్కోవడానికి తగిన సత్తా అయితే వీళ్ళ దగ్గర లేదని ఆయన ఘంటాపథంగా చెప్పుకొస్తున్నాడు.