
ఇప్పుడు వాళ్ళందరూ మీద టెర్రరిస్టు ఎటాక్ కింద కేసు పెట్టారు. ఆ పార్టీ మీద కూడా టెర్రరిస్ట్ పార్టీ అని ముద్రవేశారు. కానీ ఏ కోర్టుకీ అది టెర్రరిస్ట్ సంస్థ అని ధృవీకరించే దమ్ము లేదు. ఆ స్థాయిలో జరుగుతుంది అక్కడ హింసకాండ. తాజాగా అక్కడి ప్రభుత్వం ఈ ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయని అక్కడ సైన్యాన్ని, పోలీసులను అడిగింది. దానికి వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే ఇప్పుడు మనకు కనిపించే ఆయుధాలు చాలా తక్కువ, అసలు దాదాపుగా ఇక్కడ ఇంటింటికీ ఒక ఆయుధం ఉంది ఇక్కడ.
అమెరికాలో లైసెన్స్ తుపాకులు ఉంటాయి అక్కడ 100 మంది ఉంటే 130 తుపాకీలు ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్ లో ప్రతి ఇంటికి ఒక మిషన్ గన్ను, స్టెన్ గన్ను ఉంది. అమెరికా వాళ్ళు పోతూ పోతూ వదిలిన ఆయుధాలు వీళ్ళకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు బ్రోకర్లకు అమ్ముకుంటున్నారు. ఆ బ్రోకర్లు వచ్చి పాకిస్తాన్ లో అమ్ముతున్నారు.
పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ తో పాటుగా అక్కడ అన్ని పార్టీ వాళ్ళ దగ్గర కూడా, చివరికి అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తల ఇళ్లలో కూడా తుపాకులు ఉంటాయి. ఆ స్టేజ్ కి వచ్చేసింది అన్న విషయాన్ని అక్కడ అధికారులు చెప్పిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం తల పట్టుకున్న సందర్భం అవుతుంది.