క్రైస్తవుల్లో కేథలిక్, ప్రొటిస్టెంట్ లు ఉంటారు. ఇందులో కేథలిక్ లు బ్రహ్మచర్యం పాటించాలి. దీన్ని బాధ్యతాయుతంగా పాటించడం అనేది కచ్చితంగా ఉండాలి. ఈస్ట్రన్ మతగురువుల్లో  ఎక్కువ మంది పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. ఇప్పుడు ఇంత కఠినంగా కేథలిక్ లు ఉండాల్సిన అవసరం లేదని పోప్ చెప్పుకొచ్చారు. కేథలిక్ అనే వారు 14 సంవత్సరాల వయసులో ఇంటికి దూరంగా బ్రహ్మచర్యం పాటిస్తూ అన్నింటిని విడిచిపెట్టి భగవంతుడి నామస్మరణలోనే బతకాలి. ఇది అత్యంత కఠినమైనదని అందరికీ తెలుసు.


ఇంతటి కఠినమైన బ్రహ్మచర్యం కేథలిక్ లో ఎందుకు ఉండాలన్న భావన ఇప్పుడు బయట పడుతోంది. ఈస్ట్రన్ చర్చిల్లో ఉండే పాస్టర్లు పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. బ్రహ్మచర్యం అనేది శరీరానికి సంబంధించిన విషయం. మనుసును అదుపులోకి ఉంచుకోలేని ఒక అంశం. బ్రహ్మచర్యం విడిచి పెట్టడంతో తప్పేముందని ప్రకటించారు.


కేథలిక్, పాస్టర్లు చాలా కఠినమైన శిక్షణ తీసుకుంటారు. మానవ సహితమైన బలహీనతలకు లొంగిపోయిన కొన్ని వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఇది పెద్ద చర్చలకే దారి తీస్తుంటుంది. దీని వల్ల పెద్ద చర్చనే కొనసాగుతుంది. తాజాగా పోప్ ఈ వివాదాలపై మాట్లాడారు. బ్రహ్మచర్యం అనేది పవిత్రమైనది కాకపోవచ్చు. మత గురువులకు బ్రహ్మచర్యం దేవుడిచ్చిన వరం. ఇది తాత్కాలికమైంది. ఎక్కువగా పశ్చిమ దేశాల్లో చర్చ జరిగేది.


మత గురువు వివాహం చేసుకోకూడదన్నది కేవలం అపోహ మాత్రమే అని అన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇలాంటి విషయాలు బయటపెట్టారు. బ్రహ్మచర్యం అనేది శాశ్వతమైనది కాదు. మత గురువు హోదా మాత్రం శాశ్వతమైనది అన్నారు. దీన్ని సవరిస్తారా అని ప్రశ్న వేసినపుడు ఈస్ట్రన్ మత గురువుల్లో ఆప్షన్ ఉంది. పెళ్లి చేసుకుంటారా.. లేక బ్రహ్మచారిగా ఉంటారా అని  అక్కడ ఉండే మతగురువు ఆప్షన్ ఇస్తారు. కేథలిక్ మత గురువుల్లో కూడా పెళ్లి చేసుకుని పిల్లలు కలిగిన వారు ఉన్నారని చెప్పారు. బ్రహ్మచర్యం అనేది కేవలం క్రమశిక్షణ మాత్రమే అని చెప్పకనే చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: