
దీంతో నార్త్ కొరియా అధ్యక్షుడు రెచ్చిపోయారు. అణ్వస్త్రాలు ప్రయోగించే సమయంలో సైనికులు ఎలా ఉండాలో తెలిపే వీడియో బయటకు తీసుకొచ్చారు. మేమేమీ తక్కువ తినేది లేదన్నట్లు అమెరికాలో ఉన్న లక్ష్యాల్ని ఛేదించేలా ఉన్నాయని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ప్రకటించారు. గతంలోనే అమెరికా అధ్యక్షుడిగా ట్రంపు ఉన్న సమయంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అప్పట్లోనే యుద్ధం వచ్చేలా కనిపించింది. అప్పుడు కూడా దక్షిణ కొరియాతో కలిసి అమెరికా సంయుక్తంగా సైనిక విన్యాసాలను చేపట్టింది. దీనికి బదులుగా కిమ్ అణ్వస్త్ర ప్రయోగాలు చేపట్టారు.
మా వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయని నిరూపించడంతో అమెరికా వెనక్కి తగ్గింది. లేకపోతే మరో ఇరాక్, ఆఫ్గానిస్థాన్ లాగా నాశనం అయిపోయేది. కానీ కిమ్ నియంతలాగా వ్యవహరిస్తున్నారని ప్రపంచం కోడై కూసింది. ప్రస్తుతం ఉక్రెయిన్ వద్ద కూడా అణ్వస్త్రాలు ఉండి ఉంటే రష్యా ఇంతకు తెగించేది కాదని స్పష్టమవుతుంది. అణ్వయుధాల బూచి చూపి అగ్రరాజ్యన్నే కిమ్ వణికిస్తున్నాడు. లేకపోతే జపాన్, దక్షిణ కొరియా, అమెరికా అన్ని కలిసి నార్త్ కొరియాను ఎప్పుడో ధ్వంసం చేసేవి. కానీ కచ్చితమైన ప్రణాళిక, యుద్ధ వ్యుహ సన్నద్ధతతో సిద్ధంగా ఉన్నామని కిమ్ ప్రకటిస్తున్నాడు. అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.