
వుహన్ ఇన్ స్టిట్యూట్ లో జరిగిన విషయాలను బహిర్గతం చేయాలని నిర్ణయించారు. ఈ వివరాలను వెల్లడించే సమయంలో ఇంటిలిజెన్స్ కు సమాచారం అందించిన సున్నితమైన సోర్సులను బయట పెట్టవద్దని ఇంటిలిజెన్స్ వర్గాలు నిర్ణయించాయి. ఇప్పటికే అమెరికా ఇంటిలిజెన్స్ వర్గాలు కొవిడ్ ఎలా వచ్చిందనే దానిపై భిన్నాభిప్రాయాలు చెబుతున్నాయి. చాలా సంస్థలు ల్యాబ్ నుంచి లీకైనట్లు చెబుతుంటే మరి కొన్ని సంస్థలు జంతువుల నుంచి వచ్చినట్లు తెలుపుతున్నాయి. అమెరికాలో కొవిడ్ కారణంగా దాదాపు 11 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
కొవిడ్ మూలాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని అమెరికా ఇంటిలిజెన్స్ వర్గాలు వీలైనంత ఎక్కువ సమాచారాన్నే బయటపెడుతుంది. కానీ జాతీయ భద్రత దెబ్బతినే అంశాలను మాత్రం బహిర్గత పరచమని చెబుతోంది. కరోనా వైరస్ కు సంబంధించి చైనా లోని ల్యాబ్ నుంచే వైరస్ లీకైందని ఎనర్జీ డిపార్ట్ మెంట్ నివేదిక ఇచ్చింది. అయితే ఇది నిర్దిష్టంగా చెప్పలేదు. తాజాగా ఇచ్చి న నివేదికలో మాత్రం చైనా లోని వుహన్ ల్యాబ్ నుంచే వచ్చిందని 5 పేజీల నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. తన నెట్ వర్క్ లోని ల్యాబ్ ల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను సమర్పించినట్లు తెలుస్తోంది.