
దాని ఫలితమే ఆంధ్ర ప్రదేశ్లో 2019 ఎన్నికల్లో ఓటమి అని చెబుతుంటారు. అప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు లతో కలిసి ఎన్నికలకు వెళ్ళిన చంద్రబాబు 23 స్థానాలకే పరిమితమై అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి ప్రస్తుతం జరగబోయే ఎలక్షన్లలో ఎలాంటి తప్పిదం చేయరాదని భావిస్తున్నారు.
అందుకని మొన్న జరిగిన టిడిపి ఆవిర్భావ సభలలో బీఆర్ఎస్ పై ఎలాంటి విమర్శలు చేయకుండానే తన ప్రసంగాన్ని కొనసాగించారు. టిఆర్ఎస్ ప్రస్తుతం జాతీయ పార్టీ గా ఆవిర్భవించి ఆంధ్రలో కూడా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న వేళ మళ్లీ టీడీపీకి సంబంధించి ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయేమో అని చెప్పి బీఆర్ఎస్ పై విమర్శల బాణం ఎక్కు పెట్టలేదని తెలుస్తోంది.
గతంలో ఓటుకు నోటు కేసు తర్వాత బీఆర్ఎస్ ని ఎలాగైనా ఓడించాలని టిడిపి అధినేత చంద్రబాబు తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. దీన్నీ అనుకూలంగా మార్చుకున్నటువంటి కేసీఆర్ మళ్ళీ ఆంధ్ర నాయకులు తెలంగాణలో పర్యటిస్తున్నారని చెప్పి ప్రజల్లోకి వెళ్లారు. ఇలా అప్పటి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి పరోక్షంగా టిడిపికి విజయం చేకూర్చినట్లు అయింది.
అయితే ప్రస్తుతం టిడిపి ఆంధ్రప్రదేశ్లో పుంజుకుంటున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం టిడిపిలో కొంచెం అనుకూలమైన వాతావరణం ఏర్పడుతోంది. ఇలాంటి సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా కూడా ఇబ్బందులు తప్పవు. రాబోయే ఎన్నికల్లో టిడిపి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది తెలంగాణలో పోటీ చేసినా బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తుందా లేదా అనేది చూడాలి.