
కానీ రష్యా వద్ద ఉన్నటువంటి సుఖోయ్ యుద్ధ విమానాలతో ఉక్రెయిన్ భూభాగాలపై రష్యా బీభత్సమైన దాడులను చేస్తుంది. ఈ దాడులను తట్టుకోలేక ఉక్రెయిన్ అధ్యక్షుడు అమెరికా పోలాండ్ నాటో దేశాలకు అభ్యర్థన చేస్తున్నాడు. నూతనమైన అధునాతన యుద్ధ విమానాలను అందిస్తే రష్యాతో పోరాడుతాం. కానీ ఇలాంటి యుద్ధ విమానాలతో పోరాడలేకపోతున్నామని ఆవేదన వెల్లగక్కాడు.
మేము భూతలంలో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నామనే లోపు రష్యా గగనతలం నుంచి విపరీతమైన దాడులు చేస్తూ భయాందోళనకు గురి చేస్తుందని అన్నారు. ఒక ప్రాంతంలో రష్యాపై ఆధిపత్యం ప్రదర్శించామనే లోపు మరో ప్రాంతంలో తమను రష్యా కోలుకోలేని దెబ్బ కొడుతుందని చెప్పారు. ఇలా రష్యా చేస్తున్న దాడులను తట్టుకొని నిలబడాలంటే నూతన యుద్ధ విమానాలు కచ్చితంగా అవసరమని అమెరికాను అధ్యక్షుడు జెలెన్స్ స్కీ కోరుతున్నాడు.
రష్యా దాడులను తీవ్రతరం చేసింది. వీలైనంత తొందరగా స్వాధీనం చేసుకోవాలని పుతిన్ అభిప్రాయ పడుతున్నాడు. ఇప్పటికే మరియ పోల్ లో పర్యటించిన పుతిన్ అక్కడ రష్యన్ మాట్లాడే వారితో సంభాషించాడు. వారి వద్దకు వెళ్లి వివరాలు కూడా తెలుసుకున్నాడు. ఇలాంటి సమయంలో ఉక్రెయిన్ లో జరుగుతున్న దాడులు అడ్డుకోవాలంటే దానికి ఖచ్చితమైన సామర్థ్యం ఉన్నటువంటి యుద్ధ విమానాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ప్రస్తుతం ఎలాంటి యుద్ధ విమానాలు అమెరికా అందిస్తుందో చూడాలి.