
దీనిపై పైజల్ అహ్మద్ కోర్టు మెట్లు కూడా ఎక్కారు.. డిస్ క్వాలిఫికేషన్ చేసినా లోక్ సభ సెక్రటరీ మళ్లీ రీ స్టోర్ చేసుకునే అవకాశం లేదు. కాబట్టి హైకోర్టు ఇచ్చినా స్టే పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ విషయంలో కూడా డి క్వాలిఫికేషన్ అయినా రాహుల్ హైకోర్టు కు గానీ సుప్రీంకోర్టుకు గానీ వెళ్లి స్టే తెచ్చుకుంటే తిరిగి ఎంపీ పదవి పొందే అవకాశం ఉంది.
అయితే ఒకసారి లోక్ సభ సభ్యుడికి జైలు శిక్ష పడితే వేటు వేసే అధికారం లోక్ సభ సెక్రెటేరియేట్ కు ఉంది. తిరిగి వారికి అదే అధికారాన్నిఇవ్వొచ్చు అని రాజ్యాంగంలో ఎక్కడా లేకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఈ విషయంలో కోర్టు స్టే ఆర్డర్ ఇస్తేనే మళ్లీ లోక్ సభ సెక్రటెరియేట్ ఆమోదం తెలుపుతుంది. ఇలాంటి ఒక నిర్ణయం ఉంటుందని ఇప్పటి వరకు ఎవరికి తెలియకపోవడం ఆశ్చర్యానికి గురి చేసే అంశం. రాజ్యాంగానికి అనుగుణంగానే ఒక ఎంపీని తొలగించే హక్కు ఉన్నా లోక్ సభ సెక్రటెరియేట్ కు మళ్లీ పున:నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోవడం అనేది లోపంలా కనిపిస్తోందని రాజకీయ మేధావులు భావిస్తున్నారు.