సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశం పోలాండ్, రష్యా మీద కడుపు రగిలిపోతున్న దేశం పోలాండ్, ఉక్రెయిన్ మీద రష్యా గెలిస్తే ఆ తర్వాత మమ్మల్ని కూడా లాక్కుంటాడని అనుకుంటున్న దేశం పోలాండ్. అయితే ఇప్పుడు ఆ పోలాండ్ నాటో దేశాలందరినీ కలిపి రండి రష్యా సంగతి చూద్దాం అంటుంది. కానీ నాటో దేశాలు దానికి ఒప్పుకోవడం లేదు.


పోలాండ్ ఇస్తున్నటువంటి యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలను తీసుకుంటున్నటువంటి ఉక్రెయిన్ దేశపు అధ్యక్షుడు జెలెన్స్కి తాజాగా పోలాండ్ పర్యటనకు వెళ్ళాడు. తద్వారా వేరే దేశానికి వెళ్లినటువంటి అధ్యక్షుడిగా తిరుగుతున్నారు‌.. అక్కడ గాని రష్యా దాడి చేస్తే నాటో దేశం మీద దాడి చేసినట్టే. ఈ కారణం మీదనే ఉక్రెయిన్ అధ్యక్షుడు పోలాండ్ లో దర్జాగా తిరుగుతున్నాడు. అయితే ఇది అర్థం చేసుకున్న రష్యా పోలాండ్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు తిరుగుతున్న సమయంలోనే ఉక్రెయిన్ పై గట్టిగా దాడులు చేయడం మొదలుపెట్టింది. ఆ దాడులు కూడా తీవ్రతరం చేసి ఒక సందేశాన్ని, సంకేతాన్ని పంపిస్తుంది రష్యా.


రష్యన్ సైన్యం రెండు ఉక్రేనియన్ యూనిట్లను దెబ్బతీసింది.  ఫ్రంట్ లైన్ దగ్గర పునరాగమనంలో 40మంది సైనికులను చంపేశారు. డిప్పర్ నది యొక్క కుడి ఒడ్డున రష్యన్ ఫిరంగి దళాలు కూడా తుడిచిపెట్టుకుపోయాయి. ఉక్రెయిన్ దళాలు డాన్‌బోస్ ప్రాంతంలో విఫలమైన పురోగతిని సాధించడానికి ప్రయత్నిస్తున్నాయని రష్యా అధికారులు పేర్కొన్నందున ఇది జరిగింది, అదే సమయంలో రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరిగే అవకాశాలు కనిపించడం లేదని క్రెమ్లిన్ తెలిపింది.


ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ పోలాండ్‌ను సందర్శించారు.  యుద్ధ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో చైనా పెద్ద పాత్ర పోషించాలని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కోరారు. ఒక పక్కన పెరిగిపోతున్న తీవ్రతతో సర్వనాశనం అయిపోతున్న ఉక్రెయిన్, అదే సందర్భంలో  యుద్ధం తీవ్రతరమైతే ప్రమాదం అంటూ ఫ్రెంచ్ అధ్యక్షుడు చైనా కు వెళ్లి జింపింగ్ ను మరోసారి కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: