
ఒక పక్కన కాంగ్రెస్ చూస్తే కర్ణాటక విజయంతో అది మంచి వేగంతో దూసుకు వెళ్ళిపోతున్నట్లుగా తెలుస్తుంది. దాంతో భారతీయ జనతా పార్టీ కెసిఆర్ ప్రభుత్వ తీరుపై, ఇంకా హిందుత్వ సిద్ధాంతాన్ని కూడా రేజ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కర్ణాటకలో ముఖ్యంగా అక్కడ నాయకులు మధ్య పొరపొచ్చాలు వచ్చి గొడవలు పడడంతో అక్కడ వాళ్లు మంచి ఫలితాన్ని రాబట్టుకోలేకపోయారు.
గాలి జనార్దన్ రెడ్డి, యడ్యూరప్ప, బొమ్మయ్ ఇంకా ఇద్దరు మాజీ సీఎంలు వీళ్ళందరూ వాళ్ళలో వాళ్ళు విభేదించుకుని గొడవలు పడి కర్ణాటకలో బిజెపిని ముంచినట్లుగా తెలుస్తుంది. ఇంత జరుగుతున్నా అధిష్టానం చూస్తూ కూర్చుంది. చివరికి ఏదో ఒకటి చేద్దాం కదా అని. కానీ మోడీ గాని, అమిత్ షా గాని ఆ సమస్యను సెట్ చేయలేకపోయారు. దాంతో అక్కడ పరాజయం పాలయ్యారు. దాంతో కొంత కళ్ళు తెరిచిన బిజెపి తెలంగాణలోని నాయకులు మధ్యన పొరపచ్చాలను గమనించి సర్ది చెప్పడం మొదలుపెట్టిందట.
అక్కడ బండి సంజయ్ ని కావచ్చు, విశ్వేశ్వర్ రెడ్డిని కావచ్చు, ఈటెల రవీందర్ ని ఇంకా రాజగోపాల్ రెడ్డిని వీళ్ళందర్నీ పిలిచి మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ అమిత్ షా, నాయకుల్ని విడివిడిగా పిలిచి మాట్లాడుతున్నారట. కర్ణాటకలో కూడా ఇలా చేసే ఓటమిపాలయ్యారు. ఇలా విడివిడిగా మాట్లాడినా చివరికి అందరి ఒపీనియన్ ఒకటయ్యలా సొల్యూషన్ తీసుకురావాలని కర్ణాటకలో రాహుల్ గాంధీ ఆ రకంగానే కథ నడుపుకుంటూ వచ్చారని అంటున్నారు. మరి ఇంత తెలిసిన బిజెపి ఇప్పుడైనా మారుతుందో లేదో చూద్దాం.