పాకిస్తాన్ భారతదేశాన్ని అన్ని రకాలుగా దెబ్బ కొట్టాలని ఎప్పటి నుంచో చూస్తున్నట్లుగా తెలుస్తుంది. భారతదేశాన్ని  ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి భారతదేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై పైన బాంబులతో దాడి చేసింది. కానీ చేసింది, చేసేది పాకిస్తాన్ అయినా చేయించేది మాత్రం ఉగ్రవాదులతోటి అని తెలుస్తుంది. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎక్కువగా వచ్చే విదేశీ పెట్టుబడిదారులని కూడా రాకుండా చేయాలని కుట్ర పన్నింది.


ఆ కుట్ర ప్రకారమే హైదరాబాద్ ఇంకా జైపూర్ లలో బాంబు ఇన్సిడెంట్లు సృష్టించింది. ఇది కూడా తానుగా కాకుండా తీవ్రవాదుల ద్వారా సృష్టించినట్లు తెలుస్తుంది. మన వాళ్ళని తీవ్రవాదులు అంటాం కానీ వాళ్ళను మాత్రం వాళ్ళు మొజాహిద్దీనులు ఇంకా స్వతంత్ర యోధులు అనుకుంటారు అని కొంతమంది అంటున్నారు. నిన్నటిదాకా భారత్ ను దెబ్బతీయాలనుకున్న పాకిస్తాన్ లో ఈరోజు వాళ్లకు సంబంధించిన వాళ్ళే వాళ్ళని దెబ్బతీస్తున్నట్లుగా తెలుస్తుంది.


బాంబు దాడులు, ఎటాక్‌లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎదుటి వాళ్ళని నాశనం చేయడానికి ఇచ్చే ట్రైనింగ్ వాళ్ళ దగ్గరే పని చేస్తుంది. తెహ్రీన్ కి తాలిబన్ ఈ పాకిస్తాన్ వాళ్లు ఇంకా బెలూచిస్తాన్ రెబల్స్ వీళ్ళిద్దరూ కూడా అక్కడ పనిచేసే చైనా వాళ్ళని చంపేస్తున్నట్లుగా తెలుస్తుంది. తాజాగా అక్కడ గ్యాస్ పైప్ లైన్ వేస్తుంటే దానిపై కూడా దాడి చేసిన్నట్టుగా తెలుస్తుంది. వాళ్లని అక్కడి స్వాతంత్ర వాదులు అనాలో లేదంటే మన భాషలో వాళ్ళని తీవ్రవాదులు అనాలో తెలియదు.


కానీ 50 మంది వరకు ఆ గ్యాస్ ప్లాంట్ పై దాడి చేశారు అంట.  హంగేరియన్ కు సంబంధించిన ఈ గ్యాస్ ప్లాంట్  నార్త్ వెస్ట్ పాకిస్తాన్ లోని హంగు జిల్లాలో ఉంది. దానికి కాపలా ఉన్న నలుగురు పోలీసులు, ఇద్దరు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను కూడా చంపేశారని తెలుస్తుంది. దాంతో హంగేరీ ప్రభుత్వం అసలు మేము ఎందుకు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని నిలదీయడంతో పాకిస్తాన్ పరిస్థితి అయోమయంలో పడింది అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: