వైఎస్ వివేకా హత్య కేసులో సునీత, సీబీఐ, అవినాష్ రెడ్డి ఎవరి వాదనలు వారు వినిపించారు. అయితే హత్య కేసు సమయంలో ఫోన్ లో ఎవరు ఎవరితో మాట్లాడారో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హత్య విషయంలో అవినాష్ రెడ్డి మోటివ్ చేశారా? జగన్ చేశారా లేక ఇతరులేమైనా చేశారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఫోన్ లో ఉన్న డేటా ప్రకారం నిందితులు ఎవరనేది తేల్చుతారు.


కానీ వివేకాను హత్య చేయాల్సిన మోటివ్ అవినాష్ రెడ్డికి ఏంటి అనే దానిపై సీబీఐ విచారణ చేయనుంది. జగన్ కు మోటివ్ ఏంటి అనేది చెప్పాలి. ఇప్పుడు మోటివ్ ఎస్టాబ్లిష్ చేయడానికే ప్రయత్నాలు చేస్తున్నట్లు సీబీఐ చెబుతోంది. అయితే మొదట్లో చేసిన విచారణలో ఒక డాక్యుమెంట్ విచారణలో తేలిన విషయం ఏమిటంటే అవినాష్ రెడ్డి నిందితుడని తేల్చారు. కానీ రెండో సారి సీబీఐ చేపట్టిన విచారణలో మాత్రం డాక్యుమెంట్ గురించి పట్టించుకోలేదు. అందులోని వివరాలను సేకరించలేదు.


మోటివ్ గురించి ప్రశ్న వస్తే డాక్యుమెంట్ వివరాలు తేల్చిన తర్వాతనే మోటివ్ ఎవరనేది విచారిస్తాం అని చెబుతారు. వివేకా హత్య కేసుకు సంబంధించి సునీత చెప్పిన వివరాలు నిజమవుతాయా.. లేక అవినాష్ రెడ్డి చెప్పినా విషయాలు తేలుతాయా? జగన్ చెప్పినా అంశాలు నిజమవుతాయా తేలాల్సి ఉంది. లేకపోతే చివరకు సునంద్ పుష్కర్ హత్య కేసులో కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి శశి దరూర్ ఈజీగా బయటకొచ్చినట్లు నిందితుడు బయట తిరుగుతాడా ?


ఏదేమైనా వివేకా హత్య కేసులో ఎన్నెన్నో అనుమానాలు, రోజుకో మలుపు కుటుంబ సభ్యుల మధ్యే చిచ్చు.. అవినాష్ జైలుకెళతాడా? సునీత విజయం సాధిస్తుందా? జగన్ అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లకుండా ఆపగలుగుతాడా... ఇలా ప్రతి విషయం తేలాల్సి ఉంది. ఇందులో ఎవరూ దోషిగా తేలిన వైఎస్ కుటుంబంలో అభిప్రాయ బేధాలు తారాస్థాయికి చేరినట్లు అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: