జనసేన పార్టీకి సంబంధించిన వారాహి రథయాత్ర అసలు ప్రారంభించకపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ నటించబోయే సినిమాలు అని తెలుస్తుంది. అసలు వారాహి రథయాత్రను ఎవరు ఆపలేదని, వరుస సినిమాల కారణంగా ఆయనే ఆపేసారని తెలుస్తుంది. మనల్ని ఎవడ్రా ఆపేదీ అంటూ మొదలు పెట్టపోయిన వారాహి ప్రచార యాత్ర ఆ విధంగా ఆగిపోయినట్లుగా తెలుస్తుంది.


మూడు నాలుగు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుపుకుంటూ ఉండటం వల్ల వచ్చిన బిజీ కారణంగా ఆయన ఆ విధంగా చేశారని తెలుస్తుంది. అయితే ఈ మధ్యలో తెలుగుదేశం జనసేన పొత్తు కూడా ఖరారు అయిపోవడం జరిగింది. తెలుగుదేశం ఇంకా జనసేన పార్టీల మధ్య ఆరేడు సార్లు మీటింగ్ కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ విషయం కూడా స్వయంగా లోకేష్ చెప్పినట్టుగా తెలుస్తుంది.  


వీళ్ళిద్దరి మధ్య బహిరంగంగా ఒక మూడు సార్లు మీటింగ్ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే జనసేన పార్టీ మొదలుపెట్టబోయిన వారాహి రథయాత్ర జనసేన పార్టీకి ఉపయోగపడటం కన్నా తెలుగుదేశం ఇంకా జనసేన పార్టీల బంధాన్ని పెంచే విధంగా ఉందని అంటున్నారు. లోకేష్ పాదయాత్రకు మద్దతుగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించిన వారాహి రథయాత్ర ని ఇప్పటివరకు ఆపారని ప్రచారం జరుగుతుంది.


అయితే జూన్ నెల మొదలైన ఈ టైంలో  వచ్చేవారం నుండి తిరిగి జనసేన పార్టీకి సంబంధించిన వారాహి రథయాత్ర మొదలవబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రచారంలో కేడర్ని ఓటర్ ని తమ బంధాన్ని ఇంకా బలోపాతం చేయమని అడుగుతూ ముందుకు సాగుతారా అనేది తేలాల్సి ఉంది. లేదంటే ఈ రథయాత్రలో జనసేన ఏజెండాకి మాత్రమే ఓటు వేయమని అడుగుతారా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటివరకు నారా లోకేష్ పాదయాత్ర తెలుగుదేశం పార్టీ తరఫు నుండే సాగుతుంది. దీనిలో జనసేన ఇంకా పార్టిసిపేట్ చేయలేదన్నట్టుగా తెలుస్తుంది. కానీ రాబోయే రోజుల్లో నారా లోకేష్ ఇంకా పవన్ కళ్యాణ్  కలిసి సాగుతారా లేదా అనేది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: