ప్రస్తుతం వైఎస్ షర్మిళ తెలంగాణలో ఉన్న తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేయనున్నారని సమాచారం. దీని కోసమే ఈ మధ్య కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డి.కె శివకుమార్ ను కలిశారు. తెలంగాణలో వైఎస్ కు పోటీదారుడిగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కూడా కలవడంతో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారనే వాదనలకు బలం చేకూరింది. కానీ మీడియాతో షర్మిళ మాట్లాడుతూ.. సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేత విధానంతో చెప్పడంతో మరింత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణలో జానారెడ్డి కాంగ్రెస్ లో చేరికల కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ లో షర్మిళ చేరడం ఖాయమనే మాట వినిపిస్తోంది. కానీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేవీపీ లాంటి వారు షర్మిళను ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతినిధిగా నిలపాలని సూచనలు చేసినట్లు దీనికి షర్మిళ ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది.
షర్మిళను ఏకంగా ఆంధ్రలో సీఎం జగన్ కు పోటీగా నిలపాలని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ ఆమె మాత్రం తెలంగాణ లోనే తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో పొంగులేటి సీఎం జగన్‌ను కలవడం కూడా కలకలం రేపుతోంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ లో చేరితే ఆమెను తెలంగాణలో ఎక్కడి నుంచి పోటీ చేయిస్తారు. ఎక్కడ వారికి విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ కు కలిసొస్తుందా.. ఆమె ఒకవేళ కాంగ్రెస్ లో చేరితే ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి