చంద్రబాబు అంటే ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీకి ఎంత ప్రేమో అందరికీ తెలుసు. చంద్రబాబును అభివృద్ధి ప్రదాతగా, ప్రపంచంలోనే విశిష్ట నేతగా, అంతటి నేత ఈ ప్రపంచంలోనే లేడు అనట్టుగా జాకీలు వేసి లేపుతుంటారు ఏబీఎన్‌ ఆర్కే. తాజాగా ఆయన మరోసారి తన చంద్రబాబు ప్రేమను చాటుకున్నారు. చంద్రబాబు అరెస్టయిన రోజు ఏసీబీ కోర్టులో జరిగిన పరిణామాల గురించి ఆయన తన కొత్త పలుకు వ్యాసంలో రాసుకొచ్చారు.


అందులో ఆయన ఓ సంఘటనను ప్రస్తావించారు. ఏసీబీ కోర్టు తనకు రిమాండ్‌ విధించిన తర్వాత వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళుతూ మార్గ మధ్యంలో నోవాటెల్‌ హోటల్‌ను చంద్రబాబు చూశారట. ఇలాంటివి వస్తేనే కదా అభివృద్ధి అని చంద్రబాబు వ్యాఖ్యానించారట. అప్పుడు..  ఆ హోటల్‌ యజమాని వైసీపీ ముఖ్యులతో సన్నిహితంగా ఉంటారని పక్కన ఉన్నవారు ఆయనతో అన్నారట.


అప్పుడు చంద్రబాబు ఏమన్నారో తెలుసా.. వ్యాపారం చేసుకునే వాళ్లు అన్ని పార్టీల వారితో సత్సంబంధాలు పెట్టుకుంటారోయ్.. వాటిని మనం పట్టించుకోకూడదు అని చంద్రబాబు విశాల హృదయంతో అన్నారుట. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా లేదా అన్నదే ప్రధానంగా చూడాలని చంద్రబాబు అన్నారని.. అలా ద్రబాబు చెప్పడం ఆయన ఔన్నత్యానికి నిదర్శనం కాదా అని యావత్‌ తెలుగు ప్రజలను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నిలదీస్తున్నారు.


ఏమోయ్.. మీరు ఎప్పుడూ రాజశేఖర రెడ్డిని పోటీ పడి మరీ ప్రశంసిస్తుంటారు కదా.. అలాంటి వారు చంద్రబాబులోని ఈ తరహా దృక్పథం గురించి మాటవరసకైనా ప్రస్తావించరేం.. అంటూ కడుపు మండిపోతూ ఉండగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ యావత్‌ తెలుగు జాతిని నిలదీస్తున్నారు.. చంద్రబాబు దృక్పథం గురించి జనం పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పాపం.. చాలా బాధపడుతున్నారు. జైలుకు వెళ్లబోతూ కూడా చంద్రబాబు ఇలా అభివృద్ధి గురించి ఆలోచించినందుకు హ్యాట్సాఫ్‌ చెబితే తప్పేముందోయ్‌.. అంటూ తెలుగు ప్రజలను ప్రశ్నిస్తున్నారు. అయితే.. అసలు ఇంతకీ చంద్రబాబు అలా అన్నారా.. ఆర్కేనే అలా పులిహోర కలిపారా అన్నది సందేహం. ఎందుకంటే.. ఇలాంటి వాటికి ఆధారాలు ఉండవు కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: