
ప్రస్తుతం చంద్రబాబు అరెస్టయి రాజమండ్రిలో జైల్లో ఉన్నారు. అయితే దీనిపై ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం జైల్లో దోమలను విడిచిపెడుతున్నారని ఆయనకు విపరీతమైన దోమలు కుట్టడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని డెంగీతో జైల్లో ఒక ఖైదీ చనిపోయారని వాదిస్తున్నారు..
అయితే ఈ విషయంలో సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒక కామెంట్ చేశారు. ఆనాడు కోడికత్తితో కోస్తే చనిపోతారా? కోడి కత్తితో ఊళ్లో ఎంతో మంది వాడుతుంటారు. దానితో పెద్ద సీన్ క్రియేట్ చేశారు. కోడి కత్తితో ప్రాణాలు పోతాయా అని వాదించిన వారు. నేడు దోమలు కుడితేనే ప్రాణాలు పోతాయా? దోమలతో ఇబ్బందులు తలెత్తుతాయా? దోమలు కుడితేనే ఇంత ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావడం లేదని కౌంటర్ ఇచ్చారు.
కర్మ ఇస్ బ్యాక్ అన్నట్లు ఆనాడు జగన్ విషయంలో కోడి కత్తి కేసులో చీప్ గా మాట్లాడిన వారు.. నేడు దోమల విషయంలో ఎందుకు అంతా ఆరాటపడుతున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు బయటకు వచ్చే దాకా అనుకూల మీడియా టీడీపీ నేతలు ప్రతి విషయాన్ని వివాదం చేయాలని భావిస్తూనే ఉంటారు.