
మరోవైపు పవన్ తో కలిసి బీజేపీతో ప్రయాణం చేయాలని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. అయితే బీజేపీ విషయంలో క్యాడర్ మధ్య సందిగ్ధత నెలకొంది. బీజేపీ నాయకులు ఈ విమర్శలను తిప్పి కొడుతుంటే.. టీడీపీ వాళ్లు ప్రతి విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా సంఘర్షణ నడుస్తోంది. అయితే బీజేపీతో కలిసి వెళ్లలానే టీడీపీ ఆలోచన మారుతుందా అనే అంశం కొత్తగా తెరపైకి వచ్చింది.
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టు వెనుక ఎవరు ఉన్నారో తగిన సమయంలో చెబుతాం అని అన్నారు. తప్పకుండా చంద్రబాబు అరెస్టు వెనుక జగన్ ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే జగన్ వెనుక ఎవరు ఉన్నది అనేదే ప్రశ్నార్థకం. అయితే ఇప్పటి వరకు టీడీపీ క్యాడర్ ఆరోపించిన మాటలను ఆ పార్టీ అగ్రనేతలు వ్యాఖ్యానించనున్నారా. ఏదో జరగబోతోంది.
అయితే చంద్రబాబు అరెస్టు వెనుక కచ్చితంగా బీజేపీ ఉందని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి అన్నారు. ఏపీలో టీడీపీని బలహీనపరచడం ద్వారా బీజీపీ బలపడాలని చూస్తోందన్నారు. చాలా రాష్ట్రాల్లో బీజీపీ ఇలానే వ్యవహరించిందని ఒకరితో స్నేహం చేస్తూ.. మరొక పార్టీపై కేసులు పెట్టడం, దాడులు చేయడం.. తద్వారా ఆ పార్టీని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం బీజేపీకి అలవాటేనన్నారు. ఇప్పుడు సంతోషంగా ఉన్న జగన్ కు చంద్రబాబుకు జరిగిందే భవిష్యత్తులో జరగబోతోందని జోస్యం చెప్పారు.