ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ తన భారీ సీక్వెల్ అఖండ 2తో ప్రేక్షకుల ముందుకి రానున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ నుంచే బాలయ్య మాస్, బోయపాటి శ్రీను స్టైల్ డైరెక్షన్, థమన్ మ్యూజిక్ కలిసి పక్కా అంచనాలను ఆకాశానికెత్తాయి.  ఒక్కో డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మరీ ముఖ్యంగా బాలయ్య పర్ ఫామెన్స్ నెవర్ బిఫో ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్ లో ఉంది. ఈ సినిమాతో పాటు బాలయ్య సాలిడ్ లైనప్ కూడా ఫుల్ బిజీగా ఉంచుతోంది. కానీ… అభిమానులు అసలైన ఎగ్జైట్ అయ్యే విషయం మాత్రం ఇంకేదో— అదే నందమూరి మోక్షజ్ఞ తేజ ఎంట్రీ! ఇది ఎప్పుడు జరుగుతుందా? ఎలా ఉంటుందా? ఏ జోనర్‌లో ఉంటుందా? అన్న ప్రశ్నలు అభిమానుల్లో సంవత్సరాలుగా మసలుతున్నాయి.


మోక్షజ్ఞ సినిమా మొదట అనౌన్స్ అయ్యి ఏడాది దాటిపోయినా, ఇంకా ఏ ప్రోగ్రెస్ కనిపించకపోవడంతో అభిమానుల్లో అనుమానాలు పెరిగాయి. కానీ తాజాగా బాలయ్య ఇచ్చిన క్లారిటీ మాత్రం ఓ  విషయాన్నే క్లియర్ చేసింది.తాను, మోక్షజ్ఞ కలిసి ఆదిత్య 369 సీక్వెల్‌ను చేస్తున్నామని, అదే మోక్షజ్ఞ అధికారిక ఎంట్రీ సినిమా అవుతుందని స్పష్టంగా వెల్లడించారు. “ఆదిత్య 999 మాక్స్” పేరుతో ఈ భారీ ప్రాజెక్ట్‌ రూపొందుతుందని కూడా పరోక్షకంగా కన్ఫర్మ్ చేశారు. దీంతో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.

 

అయితే ఇప్పుడు అందరి మైండ్‌లో ఒక్కటే ప్రశ్న…ఈ సినిమా అసలు ఎప్పుడు షురూ అవుతుంది? షెడ్యూల్‌లు ఎలా ఉంటాయి? మోక్షజ్ఞ లుక్ ఎలా ఉంటుంది? మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య స్వయంగా డైరెక్ట్ చేస్తారనే బలమైన టాక్ కూడా ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. బాలయ్య స్టైల్‌లో మోక్షజ్ఞను ప్రజలకు పరిచయం చేయాలని ఆయన భావిస్తున్నట్టు కూడా సమాచారం.మరి ఇదంతా ఎప్పటికి సెటిల్ అవుతుందో, ఈ భారీ నందమూరి ప్రాజెక్ట్ ఎప్పుడు పూదోటకు వస్తుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం ఫిక్స్—మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు అఖండ రేంజ్‌లో సర్‌ప్రైజ్ ఖాయం!

మరింత సమాచారం తెలుసుకోండి: