అయితే ఓదార్పు యాత్ర చేపట్టకుండా రాష్ట్రంలోని టీడీపీ, కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కక్షతోని జగన్ ను అరెస్టు చేయించాయి. అయితే జగన్ అరెస్టు తర్వాత విజయమ్మ, షర్మిల గానీ జగన్ ను విడిపించాలని పాదయాత్ర చేయలేదు. జగన్ ను కావాలనే అరెస్టు చేశారని పాదయాత్ర చేయలేదు. ఒక వేళ పాదయాత్ర జరుగుతుండగా మాట్లాడారేమో కానీ కచ్చితంగా జగన్ అరెస్టు గురించి మాత్రం ఓదార్పు యాత్ర చేసినట్లు ఎక్కడా కనిపించదు.
కానీ టెక్నికల్ గా క్షేత్రస్థాయిలో ప్రజలకు మాత్రం జగన్ ను కావాలనే అరెస్టు చేసినట్లు తెలిసేలా పబ్లిక్ టాక్ తేవడంలో సక్సెస్ అయ్యారు. అయితే ప్రస్తుతం సామాజిక బస్సు యాత్రలు వైసీపీ చేయబోతుంది. రాష్ట్రంలో ని మూడు ప్రాంతాల్లో చేయనున్నారు. సీఎంగా జగన్ అధికారం చేపట్టాక ఎలాంటి పథకాలు వచ్చాయో తెలిపేలా చేయడం ప్రధాన లక్ష్యం. అమ్మఒడి, పెన్షన్, చేయూత ఇలా పథకాల వివరాలు తెలియజేయడం.
టీడీపీ మాత్రం నిజం తెలియాలి అని బాబు ను అక్రమ అరెస్టు చేశారని నారా భువనేశ్వరీ బస్సు యాత్ర చేపట్టారు. వైసీపీ బస్సు యాత్రకు, టీడీపీ బస్సు యాత్రకు చాలా తేడా ఉంది. భువనేశ్వరీ కేవలం చంద్రబాబు విడుదల కోసమే యాత్ర చేపడితే.. వైసీపీ మాత్రం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందిన సంక్షేమ ఫలాల గురించి తెలియజేయడమే లక్ష్యంగా సామాజిక బస్సు యాత్ర కొనసాగనుంది. మరి ఈ యాత్రల ఫలితం చివరికి ఎవరికి లాభం చేకూరుస్తుందో ఎవరికి నష్టం కలిగిస్తుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి