విదేశీ చదువులపై భారతీయుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. తమ పిల్లల మంచి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కూడా విదేశాలకు పంపేందుకు వెనుకాడటం లేదు. మరోవైపు విద్యార్థులు కూడా విదేశాల్లో చదివేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఫలితంగా ఏటా విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక ఫారిన్ చదువులు అనగానే వెంటనే అమెరికా, బ్రిటన్, ఆస్ర్టేలియా గురించే ఆలోచిస్తూ ఉంటారు.


ఎక్కువ మంది విద్యార్థులు మాత్రం అమెరికా వెళ్తున్నారు. అమెరికా యూనివర్శిటీల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థుల తాకిడి పెరుగుతోంది. క్రమంగా కరోనా ముందు పరిస్థితికి చేరుకుంటోంది. తాజాగా ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 12శాతం పెరిగింది. గడిచిన 40 ఏళ్లలో ఇదే అత్యధికం అని గణాంకాలు చెబుతున్నాయి.  ఇందులో 2.9లక్షల మంది విద్యార్థులతో చైనా మొదటిస్థానంలో ఉండగా.. 2,69,000మంది విద్యార్థులతో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇక అన్ని దేశాల నుంచి అమెరికాకు చదువుకునేందుకు వెళ్లిన వారి సంఖ్య దాదాపు 10లక్షల వరకు ఉంటుందని తాజా గణాంకాల ద్వారా తెలిసింది.


ఇక్కడ మరో ఆసక్తికర విషయమేమిటంటే అంతర్జాతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో 2009-10 తర్వాత తొలిసారి డ్రాగన్ కంట్రీని భాతర్ అధిగమించింది. ఇండియా నుంచి యేటా విద్యార్థుల సంఖ్య పెరగుతూ వస్తుండగా చైనా నుంచి గత మూడేళ్లుగా ఆ సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది భారతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 63శాతం పెరిగి 1,65,936 కు చేరుకుందని.. గత ఏడాదితో పోల్చితే 64వేల మంది విద్యార్థులు పెరగ్గా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంఖ్య కూడా 16శాతం పెరిగింది.


దీనికి కారణాలు లేకపోలేదు.  అమెరికా చైనా విద్యార్థులకు పాస్ పోర్టులను తగ్గించింది. అదే క్రమంలో చైనా కూడా అమెరికా వెళ్లొద్దు అని  చెబుతూ ఇక్కడే చదువుకోవాలని సూచిస్తోంది.  ఎందుకంటే చైనా లోని విశ్వవిద్యాలయాలు దెబ్బతింటున్నాయని భావించి చైనా విద్యార్థులపై ఒత్తిడి తెస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: