ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక పథకాలు ప్రవేశ పెడుతుంటాయి. ఈసారి ముస్లిం, మైనార్టీలు వైసీపీకి ఓటు వేస్తారా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది. ఎందుకంటే ఆ పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుండటమే కారణం. మరోవైపు టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరే అవకాశం ఉంది. అటు టీడీపీ కానీ, ఇటు వైసీపీ కానీ బీజేపీని వ్యతిరేకించడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ముస్లిం ఓటర్లు ఎటు వైపు ఉంటారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
మరోవైపు తెలంగాణలో పరిస్థితులను మనం గమనిస్తే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయి కారి ఒప్పందం ఉందనే భావనతో ఈ సారి ముస్లిం ఓటర్లను బీఆర్ఎస్ దూరం చేసుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ కి కాకుండా కాంగ్రెస్ వైపు మళ్లింది. గత ఎన్నికల్లో దాదాపు 50 శాతానికి పైగా ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్ కు ఓటేశారు.
మరోవైపు ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నారు. కర్ణాటకలోను, తెలంగాణలోను ఈ విషయం స్పష్టమైంది. ఏపీలో ఈసారి తన ప్రాబల్యం చాటు దామని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంతమేరకు ముస్లిం ఓటర్లను తమ వైపు తిప్పు కుంటుందో చూడాలి. కాకపోతే తెలంగాణ మాదిరిగా బీజేపీ వైసీపీ ఒకటే అని ప్రచారం చేయలేరు. ఎందుకంటే టీడీపీ, వైసీపీ లు రెండూ బీజేపీకి అనుకూలమే. చూద్దాం ఏం జరుగుతుందో
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి