ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కొద్ది నెలల ముందే ఏపీలో రాజకీయం ఎంతలా రాజుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం విపక్ష అధినేతలతో సహా, ముఖ్య నేతలంతా వరుస పెట్టి సభలు నిర్వహిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. తమ మాటలతో మరింత మంట పుట్టించేలా చేస్తున్నారు. అధికార పక్షం సింగిల్ గా బరిలో ఉంటే.. ప్రతిపక్షాలు జట్టు కట్టి వస్తున్నాయి.


ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయానికొస్తే ఆవేశంగా ప్రసంగాలిస్తారు.  దీనికి స్పందనగా ప్రజలు ఈలలు, చప్పట్లతో హోరెత్తిస్తారు. దీనికి పవన్ జనం అంతా తన మాట నమ్ముతారు అని భావిస్తారు.  తీరా వారంతా ఇంటికి వెళ్లి అన్ని మర్చిపోతారు. ఇది పదేళ్లుగా జరుగుతున్న తీరు. తన ఆవేశపూరిత ప్రసంగాల్లో కేవలం ఆరోపణలే కానీ.. అర్థం ఉండదనేది విశ్లేషకుల వాదన.


జగన్ సర్కారుపై ఒంటికాలిపై లేచి మరీ విమర్శలు చేసే పవన్ ఒక్కసారి అయినా వాటిమీద పునఃపరిశీలన చేసుకుంటారా అనేదే సందేహమే. ఎందుకంటే అర్థం లేని ఆరోపణలు ప్రజల మైండ్ కి ఎక్కవు. వారికి ఆధారాలు కావాలి. తాజాగా సీఎం జగన్ ఇసుకపై అక్రమంగా దోచేశారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం వాటిల్లుతుంది అని ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ ఓ సంస్థకు ఇసుక నిర్వహణను అప్పజెప్పడం వల్ల ప్రభుత్వానికి రూ.700 కోట్ల ఆదాయం వస్తోంది. కానీ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ఫ్రీ గా ఇస్తామంటున్నారు. దీనివల్ల వచ్చే ఆదాయం కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.


ఇదే సందర్భంలో గత టీడీపీ హయాంలో ఇసుకపై ఏ విధంగా దోచుకున్నారో అందరూ చూశారు. అమ్మ ఒడి డబ్బులు ఎగ్గొట్టారు అని అంటున్నారు. సీపీఎస్  సమస్యను ఏడాదిలోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఏ విధంగా పరిష్కరిస్తారో చెప్పడం లేదు. జగన్ ప్రభుత్వం సీపీఎస్ అమలు చేయడం వల్ల రాష్ట్ర బడ్జెట్ సరిపోదని అసెంబ్లీలో లెక్కలతో సహా వివరించారు. మరి దీనిని ఏ విధంగా అమలు చేస్తారో పవన్ కే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: