వేస్ట్ నుంచి విద్యుదుత్పత్తిని ప్రోత్సహించిన తెలుగు ముఖ్యమంత్రుల్లో ఆద్యుడు చంద్రబాబు. గత హయాంలో కూడా చంద్రబాబు ప్లాస్టిక్ ను తగ్గించడానికి అనేక ఆలోచనలు చేశారు. అయితే... ప్రపంచంలోనే క్లీన్, గ్రీన్, మోడ్రన్ ఐటీ సిటీల్లో ఒకటిగా మారేలా కడుతున్న అమరావతి నగరాన్ని ప్లాస్టిక్ పొల్లూషన్ కి దూరంగా ఉంచేందుకు, అలాగే రీయూజబుల్ వేస్ట్ ప్లాస్టిక్ ను సిటీలో చెత్తబుట్టలో గాని రోడ్ల మీదగా కనిపించకుండా చేయడానికి వినూత్న నిర్ణయం తీసుకున్నారు.  


ఇంతకీ ఏం చేయబోతున్నారు?
నగరంలో ఎవరూ ప్లాస్టిక్ పడేయొద్దు అని చెప్పినంత మాత్రాన, ఫైన్ వేస్తాం అని బెదిరించినంత మాత్రాన తెలుగు ప్రజలు వినరు అని అందరికీ తెలిసిందే. వారికి లాభం ఉంటే గాని ఏ పనీ చేయరు. అందుకే ప్లాస్టిక్ నివారించడానికి చంద్రబాబు ముందు ప్రజలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చెత్తకోసం ప్రతి చోట డస్ట్ బిన్ లు ఏర్పాటు చేయడంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాల కోసం ఒక ప్రత్యేక డస్ట్ బిన్ ను వాటితో పాటు పెడతారు. ఇది అందరి కోసం. అయితే... ఇలా పెట్టినా చాలామంది పట్టించుకోరు. వారి కోసం ప్రపంచంలోనే అత్యుత్తమ విధానాన్ని చంద్రబాబు అమల్లోకి తెస్తున్నారు.


నగరంలో అన్ని వీధుల్లో ప్లాస్టిక్ ఏటీఎంలు ఏర్పాటుచేయనున్నారు. వాటర్ బాటిల్లు, కూల్ డ్రింక్ బాటిల్ లేదా ఎలాంటి ప్లాస్టిక్ వేస్ట్ అయినా ఈ ఏటీఎంలో డిపాజిట్ చేయొచ్చు. చేస్తే మాకేంటి లాభం అంటారా? ఉంది... ఒక యాప్ ద్వారా మీరు ఏం డిపాజిట్ చేస్తున్నారో ఫొటో తీస్తే అదే స్కాన్ చేసి ఏటీఎం మూత ఓపెన్ అయ్యేలా చేస్తుంది. అపుడు మీ దగ్గరున్న ప్లాస్టిక్ ను అందులో వేయాలి.  ఆ యాప్ లో మీరు వేసే ప్లాస్టిక్ ను బట్టి పాయింట్లు యాడ్ అవుతాయి. ఆ పాయింట్లను గవర్నమెంటు సర్వీసులకు పే చేసేందుకు కరెన్సీలాగా వాడొచ్చు. లేదా డబ్బులుగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఇంతకాలం మీరు ఎక్కడపడితే అక్కడ పడేస్తున్న ప్లాస్టిక్ ఇందులో వేస్తే మీరు డబ్బులు సంపాదించొచ్చన్నమాట. ఇందులో కూల్ డ్రింక్ అల్యూమినియం క్యాన్లు కూడా వేయొచ్చు. ప్లాస్టిక్ కవర్లు కూడా వేయొచ్చు. అంటే అమరావతిలో ఎవరైనా ప్లాస్టిక్ పడేయాలంటే వాళ్లు డబ్బులు రోడ్డు మీద పడేస్తున్నట్టే లెక్క. ఐడియా భలే ఉంది కదా.


ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో కొత్త పథకాలు
దీంతో పాటు ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణనీయమైన చర్యలు చేపట్టింది.  ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక దృష్టి సారించింది. పిథాపురం మరియు భీమవరం నియోజకవర్గాల్లో, ఘన మరియు ద్రవ వనరుల నిర్వహణ (SLRM) పై పైలట్ ప్రాజెక్టులు ప్రారంభించింది.  ఈ పథకాల ద్వారా, తడి మరియు పొడి వ్యర్థాలను వేరు చేసి, వాటిని పునర్వినియోగానికి అనుకూలంగా మార్చే విధానాలు అమలులోకి వచ్చాయి. ప్రతి యూనిట్‌లో ఆరుగురు మహిళలు పనిచేస్తూ, వ్యర్థాలను సేకరించి, ప్రత్యేక విక్రేతలకు విక్రయిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్లాస్టిక్ వ్యర్థాలను విలువైన పదార్థాలుగా మార్చే పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా, ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, వాటిని పునర్వినియోగించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.


సమాజం భాగస్వామ్యంతో ముందుకు
తెలుగు ప్రజల ప్రవర్తనను పరిగణలోకి తీసుకుంటూ, ప్లాస్టిక్ రహిత నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు, సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి అని భావిస్తోంది. ప్రజలలో అవగాహన పెంచేందుకు, పాఠశాలలు, కాలేజీలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పించింది.. భవిష్యత్తులో ప్లాస్టిక్ ఏటీఎంలను ప్రతి పట్టణంలో ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: