
దీంతో వైసిపి గేట్లు తెరిచే ఉంటాయి.. అని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే అసలు ఏడాది తర్వాత కూడా ఏమాత్రం పుంజుకోని వైసీపీలోకి ఎందుకు వెళ్తున్నారుచచ అనేది గమనిస్తే ప్రధానంగా మరో ప్రత్యామ్నాయ పార్టీ నాయకులకు కనిపించకపోవడమే. అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు కూడా బలంగా లేకపోవడంతో ఎవరు ఇతర పార్టీల వైపు కన్నెత్తి చూడడం లేదు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని అంచనా ఉన్నప్పటికీ.. ఆ పార్టీలోనూ నాయకులు చేరడం లేదు. కారణాలు ఏవైనా కాంగ్రెస్ విషయంలో నాయకుల మధ్య పెద్దగా చర్చ కూడా నడవడం లేదు.
ఈ నేపథ్యంలోనే వైసీపీ వైపు ముగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి వైసీపీ నుంచి చాలామంది వెళ్లిపోతారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుండగా.. దానికి భిన్నంగా ఇతర పార్టీల నుంచి వచ్చే వారి సంఖ్య ఇప్పుడు కనిపిస్తోంది. అంతేకాదు తాము ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభిస్తే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని వైసీపీ నాయకులు అంటున్నారు. అందుకే ఆ పార్టీ నాయకులు వైసిపి గేట్లు తెరిచే ఉంటాయి అని వ్యాఖ్యానిస్తున్నారు.
తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ప్రజల కోసం పనిచేసే వారికి వైసిపి గేట్లు ఎప్పుడు తెరిచే ఉంటాయి అని చెప్పుకు వచ్చారు. గతంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇదే విషయం చెప్పారు. తమ పార్టీ ఎవరికీ వ్యతిరేకం కాదని, చేరే వారు చేరచ్చని ఆయన వ్యాఖ్యానించారు. అయితే అనూహ్యంగా ఆ తర్వాత వెళ్ళిపోయే నాయకులే కనిపించారు. కానీ వచ్చేవారు కనిపించలేదు. తాజాగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం చేరికతో ఇప్పుడు మళ్లీ వైసిపి లోకి నాయకులు వెళ్తారనే చర్చ ఊపందుకుంది.
అదేవిధంగా కొత్త వారితో పాటు మాజీ నాయకులు కూడా వస్తారని భావిస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి వెళ్లిపోయిన కీలక నాయకులు చాలామందికి ఆయా పార్టీల్లో పెద్దగా ప్రాధాన్యం కనిపించడం లేదనేది వాస్తవం. అందుకే వారు కూడా వైసిపి పుంజుకుంటే ఇటు వచ్చేయొచ్చు అనే చర్చ ఈ పార్టీలో కొనసాగుతోంది. పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పలువురు నాయకులు ఇదే విషయం చెప్పుకొచ్చారు.
వెళ్లిపోయిన వాళ్లే తిరిగి వస్తే పార్టీలో చేర్చుకుంటారా అని జగన్ను ప్రశ్నించినప్పుడు ఆయన నవ్వి ఊరుకున్నారు. అంటే దాదాపు చేర్చుకోవాలి అన్న ఉద్దేశంతోనే జగన్ ఉన్నట్టు స్పష్టమైంది. సో కొత్తవారికి -పాత వారికి కూడా వైసిపి గేట్లు తెరిచి ఉంటాయి అన్న సంకేతాలు ఇచ్చినట్టు అయింది. మరి ఎంతమంది వస్తారు.. ఎంతమంది చేరుతారు అనేది చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు