
అనుపమ పరమేశ్వరన్ కొంత కాలం క్రితం పరదా అనే సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. లేడీ ఓరియంటెడ్ మూవీ గా రూపొందిన ఈ సినిమాలో అనుపమ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇకపోతే ఈ మూవీ ఈ రోజు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా అనుపమ "కిష్కిందపురి" అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ఈ రోజు అనగా సెప్టెంబర్ 12 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఇలా అనుపమ ఓ సినిమాతో థియేటర్లలో హంగామా చేస్తూ , మరో సినిమాతో ఓ టీ టీ లో హంగామా చేస్తుంది.