నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా డాకు మహారాజ్ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలయ్య , బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ టీ టీ డీల్ కూడా క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను ఓ ప్రముఖ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

బాలయ్య "అఖండ 2" మూవీ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. గతంలో బాలయ్య , గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వీర సింహా రెడ్డి అనే సినిమా రూపొంది మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే బాలయ్య , గోపీచంద్ మలినేని తో సినిమా చేసిన తర్వాత క్రిష్ జాగర్లమూడి తో సినిమా చేయనున్నట్లు గత కొన్ని రోజులు వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ దసరా పండుగ సందర్భంగా బాలయ్య ,   క్రిష్ జాగర్లమూడి మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య , క్రిష్ కాంబోలో మొదటగా గౌతమీపుత్ర శాతకర్ణి అనే సినిమా వచ్చింది. ఈ మూవీ తర్వాత వీరి కాంబోలో ఎన్టీఆర్ కథానాయకుడు , ఎన్టీఆర్ మహానాయకుడు అనే సినిమాలో కూడా వచ్చాయి. ఇక వీరి కాంబోలో నాలుగవ మూవీ కి సంబంధించిన అప్డేట్ దసరా పండుగ సందర్భంగా రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: