
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో టెక్నాలజీ విప్లవాన్ని తీసుకొచ్చే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్తు పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డీప్ టెక్నాలజీ రంగాలపై ఆధారపడుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో సేవలన్నీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఆగస్టు నాటికి అన్ని సర్వీసులు ఈ వేదిక ద్వారా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజలు కార్యాలయాలకు రాకుండానే అన్ని సేవలు పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
చాట్‌జీపీటీ వంటి సాంకేతికతలు అనేక సమస్యలకు పరిష్కారం అందిస్తున్నాయని, క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా శ్రమ, సమయం గణనీయంగా తగ్గుతుందని చంద్రబాబు తెలిపారు. గతంలో భారతదేశం టెక్నాలజీ వినియోగదారుగా ఉండగా, ఇప్పుడు తయారీదారుగా మారిందని ఆయన గర్వంగా చెప్పారు. జనాభాను సమర్థవంతంగా వినియోగించుకుంటే దేశం అభివృద్ధిలో అగ్రస్థానానికి చేరుతుందని, సరైన నాయకత్వం ఈ లక్ష్య సాధనకు కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ సిటీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు చంద్రబాబు వెల్లడించారు. డ్రోన్లు యుద్ధాలకు మాత్రమే కాక, పౌర సేవలకు కూడా ఉపయోగపడుతున్నాయని తెలిపారు.
అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాలని కేంద్రాన్ని కోరిన ఆయన, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు భారీ డిమాండ్ ఉందని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం అనుకూల వాతావరణం కలిగి ఉందని ఆయన స్పష్టం చేశారు.ఈ ప్రకటనలు రాష్ట్రంలో టెక్నాలజీ ఆధారిత అభివృద్ధికి ఊతం ఇస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వాట్సాప్ గవర్నెన్స్, డ్రోన్ సిటీ వంటి ఆలోచనలు ప్రజలకు సేవలను సులభతరం చేయడంతో పాటు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని అంచనా వేస్తున్నారు. చంద్రబాబు విజన్ రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్‌గా మార్చే దిశగా ముందడుగు వేస్తోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు