ఏపీలో వైసిపి ప్రతిపక్షంలో ఉంది. అయితే వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులు , మాజీ ఎమ్మెల్యేలు , కీలక నేతలు ఇప్పుడు బాగా ప్రస్టేషన్ లో ఉన్నట్టు ఆ పార్టీ నేతల్లో నే అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు బాగా ఎక్కువ. ఈ క్రమంలోనే టీడీపీ అంటే కమ్మ .. వైసీపీ అంటే రెడ్డి సామాజిక వర్గం బాగా హైలెట్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే కాపు సామాజిక వర్గం ఇప్పుడు ఎక్కువగా జనసేన వైపు చూస్తోంది. క్షేత్రస్థాయిలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు యువకులు అందరూ పవన్ కళ్యాణ్ జనసేన వైపు ఎక్కువగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీలో ఉన్న కాపు నేతల వెంట వెళ్లేందుకు క్షేత్రస్థాయిలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు పెద్దగా ఇష్టపడని పరిస్థితి ఉంది. మరియు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి , కృష్ణ , గుంటూరు జిల్లాలో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు తమ సామాజిక వర్గం ఓటర్లు తమను లైక్ చేయకపోవడంతో కక్కలేక మింగలేక చందంగా ఉన్నారు.
తాము ఎంత డబ్బా కొట్టుకుంటున్న క్షేత్రస్థాయిలో తమ కులం ఎక్కువగా జనసేన వైపు ఉంటుంది. దానికి తోడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కూడా ఈ కులస్తులకు నచ్చ లేదు. జనసేన + టిడిపి పొత్తు వల్ల కూడా మిగిలిన సామాజిక వర్గాల సంగతి ఎలా ఉన్నా వైసీపీలో ఉన్న షాపులు బాగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే వైసీపీలో కాపులు బాగా ఇబ్బంది పడుతున్నారని ... ఈ పొత్తు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులోనూ తమ ఇబ్బందులు తప్పవు అన్న నిర్ణయానికి వచ్చేసినట్టు ఆ పార్టీలోనే అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి