నిరుద్యోగులకు శుభవార్తల శుభవార్తలు వినిపిస్తూనే వున్నాయ్. ఒకసారి రాష్ట్రంలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వస్తే మరోసారి కేంద్రం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అవుతుంది.. దీనివల్ల ఒకటి మిస్ అయినా మరొకటి అయినా కొట్టే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు వరలు ఇచ్చేశాడు. 

 

కేవలం నాలుగు నెలల పాలనలో దాదాపు నాలుగు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలిపించాడు సీఎం జగన్. ఈ నేపథ్యంలోనే కేంద్రం మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. ఇప్పటికే స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC నోటిఫికేషన్లు జారీ చేసి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నాయి. 

 

ఇప్పుడు మరో 48 ఖాళీల భర్తీకి యూపీఎస్‌సీ మరో నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్, సీనియర్ ఎగ్జామినర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని ఇప్పుడు భర్తీ చేస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 12, 2019. కాగా ఈ పోస్టుల దరఖాస్తు ఇప్పటికే ప్రారంభమయ్యింది. 

 

కేంద్రం పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం 48 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అందులో అసిస్టెంట్ రిజిస్ట్రార్- 11, సీనియర్ ఎగ్జామినర్- 10, అసిస్టెంట్ డైరెక్టర్ (బ్యాంకింగ్)- 3, అసిస్టెంట్ డైరెక్టర్ (క్యాపిటల్ మార్కెట్)- 1, ప్రిన్సిపల్ డిజైన్ ఆఫీసర్ (కన్‌స్ట్రక్షన్)- 4, సీనియర్ డిజైన్ ఆఫీసర్ గ్రేడ్-1 (కన్‌స్ట్రక్షన్)- 4, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ (డిజైన్)- 2, సీనియర్ డిజైన్ ఆఫీసర్ గ్రేడ్-1 (ఎలక్ట్రికల్)- 6, డైరెక్టర్ (సేఫ్టీ)- 7 ఖాళీలు ఉన్నాయి. 

 

అయితే ఈ పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 12, కాగా ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.25. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ పోస్టులకు అర్హులైన వారు వెంటనే అప్లై చేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: