కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన విద్యార్థి మల్లాది రాహత్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డులో స్థానం సంపాదించాడు. దాదాపు 8 గంటల స‌మ‌యంలో 36 భారతీయ భాషలు, 69 విదేశీ భాషల్లో మొత్తం 105 పాటలు పాడినందుకు గాను రాహ‌త్‌కు ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన గిన్నిస్ బుక్‌లో చోటు ద‌క్కింది. అయితే వాస్త‌వానికి ఈ ప్ర‌ద‌ర్శ‌న 2018 జనవరి 6వ తేదీన గాంధీనగర్‌లోని హోటల్‌ ఐలాపురంలో జ‌రిగింది. అన్ని రకాల ప‌రిశీల‌న‌లను పూర్తి చేసిన అనంత‌రం వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్‌లో రాహత్‌ పేరు నమోదు చేసిన‌ట్లు  ప్ర‌క‌టించారు.  ‘మోస్ట్‌ లాంగ్వేజెస్‌ సంగ్‌ ఇన్‌ కాన్సర్ట్‌’ బిరుదుకు ఎంపిక చేసినట్లు  ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. 

 

ఇదిలా ఉండ‌గా అంత‌కు ముందు వివిధ భాషల్లో 76 పాటలు పాడిన గజల్‌ శ్రీనివాస్‌ పేరిట ఉన్న‌ గత రికార్డును రాహ‌త్ అధిగ‌మించిన‌ట్ల‌యింది. ఓ తెలుగు క‌ళ‌కారుడి రికార్డును మ‌రో తెలుగు క‌ళాకారుడే అధిగ‌మించడంపై ప‌లువురు నెటిజ‌న్లు అభినంద‌న‌లు తెలుపుతున్నారు. రాహ‌త్ వ్య‌క్తిగ‌త వివ‌రాల విష‌యాల‌కు వ‌స్తే... రాహత్‌ ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గతంలో సాక్షి దినపత్రిక నిర్వహించిన పోటీలో వండర్‌ కిడ్‌ అవార్డు కూడా సొంతం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. రాహ‌త్‌లో బ‌హుముఖ ప్ర‌జ్ఞ‌లు ఉన్నాయ‌నే చెప్పాలి. 

 

గ‌తంలో బాలల చిత్రం దాన వీర శూర కర్ణ చిత్రంలో శకుడిగా నటించి అంద‌రి మ‌న్న‌న‌లు పొందారు. పౌరాణిక నాటకాలలో శ్రీకృష్ణుడు, అనిరుద్ధుడు, నారదుడు, శ్రీ మహావిష్ణువు వంటి పాత్ర‌ల్లోనూ ఒదిగిపోవ‌డం విశేషం. గతేడాది నంది నాటకోత్సవాల్లో పౌరాణిక నాటక విభాగంలో నంది అవార్డ్‌ గెలుచుకున్నాడు. రాహత్‌కు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కడంపై  తెలుగు క‌ళా సంస్థ‌లు, సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు అభినందనలు తెలియజేశారు. భ‌లా రాహ‌త్..మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని, తెలుగువాళ్ల ఘ‌న‌కీర్తిని, ఇక్క‌డి క‌ళ‌ల‌ను ప్ర‌పంచం న‌లుమూలాల చాటాల‌ని కోరుకుంటున్నామ‌ని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్ల‌తో ప్రొత్స‌హిస్తున్నారు.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: