ఆంధ్రాలో ఉన్న నిరుద్యోగులకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్థుంది.. ఎపి లో స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇటీవల వరుసగా ఉద్యోగా ప్రకటనలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా సంస్థ నుంచి ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో పని చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 8లోగా రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 9న ఉదయం 10 గంటలకు వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు.

నోటిఫికేషన్ ద్వారా మొత్తం 250 ఖాళీలను భర్తీ చేయనున్నారు.. డెలివరీ ఎగ్జిక్యూటీవ్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగులను నియమించుకోవాలని కంపెనీ భావిస్తుంది.

ఈ ఉద్యొగాల పూర్తీ వివరాలు ఇలా.. 

విభాగంలో 100 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. అభ్యర్థులకు స్మార్ట్ ఫోన్, బైక్, టూ వీలర్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.

జీతం: 13 వేల నుంచి 15 వేల వరకు ఉంటుంది..వేతనంతో పాటు పెట్రోల్ అలవెన్స్, మొబైల్ బిల్, ఇతర ఇన్సెంటీవ్స్ చెల్లించనున్నారు. ఈ విభాగంలో ఎంపికైన అభ్యర్థులు ఏపీలో పని చేయాల్సి ఉంటుంది.

ఈ విభాగంలో 150 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. పురుషులు/స్త్రీలు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు.. ఎంపిక అయిన వాళ్ళు హైదరాబాద్‌లో పని చెయాల్సి ఉంటుంది.. 

ఈ ఉద్యొగాల పై ఆసక్తి కలిగిన విద్యార్థులు, నిరుద్యోగులు 08లోగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల మొబైల్ నంబర్లకు గూగుల్ మీట్ ఇంటర్వ్యూ లింక్ పంపిస్తారు. ఆ లింక్ ద్వారా అభ్యర్థులు ఈ నెల 9న జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇతర వివరాలకు 8978524022, 7780558838 కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవాలి...


మరింత సమాచారం తెలుసుకోండి: