అవును అండి.. నిజంగానే ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి.. వరుసగా నాలుగో రోజుల నుండి బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఎంత భారీగా తగ్గాయి అంటే.. కరోనా వైరస్ కారణంగా భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు సామాన్యులు కొనే రేంజ్ కీ వచ్చేశాయి.. అయినా ఎం ఉపయోగం.. బంగారంను ఎవరు కొనలేని స్థితి మరి. 

 

నేడు బంగారం, వెండి ధరలు హైదరాబాద్ మార్కెట్ లో ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 90 రూపాయిల తగ్గుదలతో 44,120 రూపాయలకు చేరింది. ఇంకా ఇదే నేపథ్యంలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 300 రూపాయిల తగ్గుదలతో 40,430 రూపాయలకు చేరింది. ఇలా బంగారం ధరలు భారీగా తగ్గగా వెండి ధర కూడా భారీగా తగ్గాయి. 

 

దీంతో నేడు కేజీ వెండి ధర 500 రూపాయిల తగ్గుదలతో 41,050 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ, ఆర్ధిక రాజధాని ముంబైలోను బంగారం ధరలు ఇలానే భారీగా తగ్గాయి. దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలకు భారీగా డిమాండ్ తగ్గటమే కారణం అని అంటున్నారు. 

 

అంతేకాదు! స్టాక్ మార్కెట్లు కూడా గత మూడు రోజులుగా దుమ్ము రేపుతున్నాయి. అందుకే బంగారం, వెండిపై ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లు ఇప్పుడు మిగితా వాటిపై ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల కూడా బంగారం ధరలు తగ్గుతున్నాయి అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. అయినా బంగారం ధరలు ఎంత తగ్గినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుంది మరి.                           

మరింత సమాచారం తెలుసుకోండి: