బంగారం వరుసగా మూడు రోజుల నుంచి పెరుగుతూ వస్తుంది. ఈరోజు మార్కెట్ లో కూడా బంగారం ధర దూసుకుపోయింది. నిన్నటి రేటు తో పోలిస్తే ఇంకాస్త పైకి కదిలింది.బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు.మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పరుగులు పెడుతోంది. దీంతో ఇండియన్ మార్కెట్ లో కూడా పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. బంగారం ధరలు పెరిగితే.. వెండి ధర కూడా భారీగా పెరిగింది. ఒక్కరోజులోనే అంత రేటు పెరగడం గమనార్హం.. 


ఇక హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 పైకి కదిలింది. దీంతో రేటు రూ.49,590కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.300 పెరుగుదలతో రూ.45,450కు చేరింది. విజయవాడలోనూ ఈ రేట్లు నమోదయ్యాయి.. వెండి ధరలు ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాయి.బుధవారం వెండి ధర పెరిగింది. రూ.1700 పరుగులు పెట్టింది. దీంతో కేజీ వెండి ధర రూ.78,500కు చేరింది. అంటే తులం వెండి ధర దాదాపు రూ.785 వద్ద ఉందని చెప్పుకోవచ్చు. 


అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరల పెరిగాయి. బంగారం ధర ఔన్స్‌కు 0.17 శాతం పెరిగింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1871 డాలర్లకు చేరింది.ఒక్క వెండి ధరలు పడిపోయాయి. వెండి ధర ఔన్స్‌కు 0.15 శాతం తగ్గుదలతో 28.29 డాలర్లకు క్షీణించింది. బంగారం ధరకు మూడు నెలల గరిష్ట స్థాయి అని చెప్పొచ్చు.కాగా బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్ తదితర అంశాలు పసిడి ధరల పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: