బంగారం ప్రియులకు భారీ షాక్ ఎదురైంది. రోజరోజుకి బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బంగారం ధరలు పరుగులు పెడుతున్నా.. వెండి ధర మాత్రం అమాంతం తగ్గింది. అయితే బంగారం ధర ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. పెళ్లి సీజన్ ఉండటంతో జ్యూవెలరీ షాపులు కొనుగోలు దారులతో కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం బంగారం ధర భారీగా పెరిగింది. తులం బంగారంపై రూ.300 నుంచి రూ.700 పెరిగింది. దేశంలోని ఆయా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,050గా ఉంది. అలాగే బెంగళూరు పట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200గా ఉంది. అలాగే ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,650గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,200గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,200గా ఉంది. విజయవాడ, కేరళ, హైదరాబాద్‌లో నమోదైన ధరలే కొనసాగుతున్నాయి.


వెండి ధరలు..

బంగారం ధరలు పరుగులు పెడుతున్నా.. వెండి ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 61,400గా ఉంది.  అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.65,600గా ఉంది. కేరళలో కిలో వెండి ధర రూ.65,500గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,600గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో.. హైదరాబాద్‌లో ఉన్న ధరలే అక్కడ కొనసాగుతున్నాయి. అయితే బంగారం ధరలు పెరగడంలో పసిడి ప్రియులకు నిరాశే మిగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: