ఎండాకాలం రాకపోయినా అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఫలితంగా ప్రజలు బయటకు వెళ్ళలేక, ఏదో ఒక సమస్యతో తిరిగి వస్తున్నారు. ఎండల ప్రభావం తట్టుకోవడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ ఎండాకాలంలో శరీరంలో  నీటి శాతం తగ్గకుండా  చూసుకోవాలి. శరీరం తేమ గా ఉండేలా చూసుకోవడం మంచిది. లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ, శరీరాన్ని తాజాగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయాలి.

మనలో చాలా మంది  మరీముఖ్యంగా చల్లని పానీయాలు సేవించడానికి మక్కువ చూపుతున్నారు. మరీ ముఖ్యంగా పల్చటి మజ్జిగ, కర్బూజ, పుచ్చకాయ ఇలాంటివి ఎక్కువ నీరు కలిసిన తాజా పండ్లు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అందులో ఒకటి కర్బూజా కూడా. కర్బూజా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి అని నిపుణులు చెబుతున్నారు. అవేమిటంటే కర్బూజా లో ఉండే పోషకాలు శరీరానికి కావలసిన నీటిని అందిస్తాయి. శరీరం హైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. మలబద్ధకం, మూత్ర సంబంధిత సమస్యలు, అలసట, నీరసం, అధిక రక్త పీడనం వంటి సమస్యల నుండి కాపాడుతుంది..

అంతేకాకుండా వీటిలో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు పెరుగుతామనే ఇబ్బంది కూడా లేదు. లక్షణంగా ఈ సీజన్లో దొరికే పండు కాబట్టి పుష్కలంగా తినవచ్చు. ఇందులో ముఖ్యంగా విటమిన్ ఏ కూడా లభిస్తుంది. ఇందులో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మలబద్దకాన్ని నివారించే శక్తి ఉంది. అంతేకాకుండా రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగించడంలో ఉపయోగపడుతుంది. ఇక కండరాల నొప్పి నుంచి విముక్తి కలిగిస్తుంది..

కర్బూజా మాత్రమే కాకుండా కర్బూజా విత్తనాలు కూడా మనకు ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. కాబట్టి కర్బూజా తిన్న వెంటనే  కర్బూజా విత్తనాలను ఎండబెట్టుకుని కూడా తినడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. కాబట్టి ఈ కాలంలో పుష్కలంగా దొరికే ఈ కర్బూజా పండ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకండి. తక్కువ ఖర్చుతో దొరికే ఈ పండు,ఎక్కువ ఆరోగ్యప్రయోజనాలను చేకూరుస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.. ఈ ఎండాకాలంలో కర్బూజ పండ్లు తిని ఆరోగ్యంగా ఉండండి..


మరింత సమాచారం తెలుసుకోండి: