కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి ఎలాంటి నొప్పికైనా యూకలిప్టస్ ఆయిల్‌ ఒక మంత్రం లా పనిచేసి ఇట్టే నొప్పీ నుంచి విముక్తి కలిగిస్తుంది.దీని గురుంచి ఇప్పుడున్న జెనేరేషన్ వాళ్ళకి ఏమాత్రం అవగాహనా లేదు కానీ 90s వాళ్ళకి అయితే తప్పక తెలిసివుంటుంది. యుకలిప్టెస్ ఆయిల్ దీనినే తెలుగులో నీల‌గిరి తైలం అని అంటారు.

ఇప్పుడైతే జలుబు చేసిన వెంటనే మందులు కోసం పరుగేడతారు కానీ అప్పట్లో జలుబు చేస్తే నిలగిరి ఆకులు తెచ్చి నీళ్లలో వేసి మరిగించి, జలుబు చేసిన వారికి ఆవిరి పట్టేవారు. అప్పుడు ఎలాంటి ముక్కు దిబ్బడయన ఉదయానికల్లా పరార్ అయ్యేది. నీలిగిరి ఆకుల నుంచి తీసిన నీలిగిరి తైలంకు ఎలాంటి నొప్పులనైనా నివారించే గుణం వుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఒక్కొక్కరికి శారీరక శ్రమ వల్ల బాడీ పేయిన్స్ వస్తుంటాయి అలాంటి వారు  ఒక బ‌కెట్ గోరువెచ్చని నీటిలో అర స్పూన్ యూకలిప్టస్ ఆయిల్ వేసుకుని బాగా క‌లిపి స్నానం చేయాలి.ఇందులో వున్న పినోలిక్ అనే యాసిడ్ వల్ల నొప్పీ నుంచి నివారణ కలుగుతుంది.

అజిర్తిసమస్యలు త‌గ్గించ‌డానికి యూకలిప్టస్ ఆయిల్ ఉప‌యోగ‌ప‌డుతుంది.ఒక గ్లాస్ గోరు వెచ్చ‌టి నీటితో రెండుచుక్క‌లు యూక‌లిప్ట‌స్ ఆయిల్ వేసుకొని త్రాగాలి.దానివల్ల జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు తగ్గి, జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

అలాగే జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధపడేవారు ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకునీ,అందులో ఐదారు చుక్క‌లు యూక‌లిప్ట‌స్ ఆయిల్ వేసి కాసేపు ఆవిరి ప‌డితే మంచి ఫలితం ఉంటుంది.


ఇక న‌డుమునొప్పి, త‌లనొప్పి, మోకాళ్లనొప్పి, మడమ నొప్పి, మెడనొప్పి వంటి వాటిని త‌గ్గించుకోవ‌డం కోసం యూకలిప్టస్ ఆయిల్‌ను వాడటం వల్ల ఇందులో వున్న సీనోలి కాంపౌండ్ వల్ల నొప్పీ నివారణ కలుగుతుంది.
నొప్పీ వున్న చోట యూక‌లిప్ట‌స్ ఆయిల్‌తో మ‌సాజ్ చేసుకొని వేడి నీళ్ల కాపడం పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి: